TTD : టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. నాగాబాబు స్పందన
TTD : మునుపు ఉన్న అవకతవకలన్ని సరిచేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ఠ ని మరింత మెరుగుపరచాలని మనస్పూర్తిగా కోరుకుంటు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు.
- Author : Latha Suma
Date : 01-11-2024 - 2:07 IST
Published By : Hashtagu Telugu Desk
BR Naidu: టీటీడీ ఛైర్మన్‌గా టీవీ5 ఛానల్ అధినేత బీఆర్ నాయుడిని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు టీటీడీ పదవి దక్కడంపై జనసేన నాయకులు, నటుడు నాగబాబు స్పందించారు. హిందు ధర్మాన్ని, శ్రీనివాసుడిని అమితంగా కొలిచే TV5 ఛైర్మన్ బీఆర్ నాయుడు గారికి టీటీడీ ఛైర్మన్ హోదా రావడం శుభసూచికం అన్నారు. సరైన వ్యక్తికి సరైన సమయంలో సరైన గౌరవం లభించినందుకు చాల సంతోషంగా ఉందని నాగబాబు తెలిపారు.
హిందు ధర్మాన్ని, శ్రీనివాసుడిని అమితంగా కొలిచే TV5 ఛైర్మన్ B.R నాయుడు గారికి @BollineniRNaidu T.T.D ఛైర్మన్ హోదా రావడం శుభసూచికం,
సరైన వ్యక్తికి సరైన సమయంలో సరైన గౌరవం లభించినందుకు చాల సంతోషంగా ఉంది..
మునుపు ఉన్న అవకతవకలన్ని సరిచేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ఠ ని…— Naga Babu Konidela (@NagaBabuOffl) November 1, 2024
మునుపు ఉన్న అవకతవకలన్ని సరిచేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ఠ ని మరింత మెరుగుపరచాలని మనస్పూర్తిగా కోరుకుంటు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు. అలాగే జనసేన తరపున టీటీడీ సభ్యులుగా ఎన్నికైన బురగపు ఆనంద సాయి, అనుగోలు రంగశ్రీ, మహేందర్ రెడ్డి గారికి మరియు సభ్యులు గా ఎన్నికైన అందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని నాగబాబు వివరించారు.