Tirumala Laddu Controversy : రోజాకు దిమ్మతిరిగే సమాధానము ఇచ్చిన నెటిజన్లు
Tirumala Laddu Controversy : తిరుపలి లడ్డూలో కల్తీ చేసింది ఎవంటూ రోజా తన యూట్యూబ్ చానెల్‌లో పొల్ చేపట్టగా..నెటిజన్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు
- By Sudheer Published Date - 02:01 PM, Tue - 24 September 24

Big Shock To Roja Over Laddu Issue : ప్రస్తుతం ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు ఇష్యూ (Laddu Issue) నడుస్తుంది. హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం తట్టుకోలేకపోతున్నారు. సామాన్య ప్రజలేనే కాదు దేవుడ్ని సైతం మోసం చేసి కల్తీ చేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఈ పాపానికి ఒడికట్టిన వారికీ శిక్షించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ తప్పు జరిగిందని అధికార పార్టీ ఆరోపిస్తుంటే..లేదు..లేదు మా హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని, వారు ప్రమాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి రోజా దీనిపై స్పందించింది.
తన యూట్యూబ్ ఛానెల్‌లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆమె పోల్ నిర్వహించింది. తిరుపలి లడ్డూలో కల్తీ చేసింది ఎవంటూ రోజా (RK ROja) తన యూట్యూబ్ చానెల్‌లో పొల్ చేపట్టగా..నెటిజన్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. జగన్ దే తప్పంటూ 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎవరి పాలనలో తిరుమల బాగుందని ఆమె పోల్ పెట్టగా… చంద్రబాబు పాలనలో బాగుందని 77 శాతం మందికి పైగా ఓటు వేశారు. ఆ విధంగా వచ్చిన పోల్ ఫలితాలు రోజాకు ఝలక్ ఇచ్చాయనే చెప్పచ్చు.
ఇదిలా ఉంటె..తిరుమల లడ్డు వివాదం తో ఇక లడ్డు విక్రయించే వారి సంఖ్య తగ్గుతుంది అని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా లక్షల్లో లడ్డూలు అమ్ముడుపోతూ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ లడ్డూ వివాదం సెప్టెంబర్ 18వ తేదీన మొదలైంది. దీంతో లడ్డూల అమ్మకం తగ్గిపోతుందని, భక్తులు ఎవరు లడ్డూలు కొనుక్కోరని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ మొత్తం విరుద్ధంగా జరిగింది. 19వ తేదీ రోజు 3.59 లక్షల లడ్డూలు అమ్ముడుపోగా.. అలాగే 20వ తేదీ 3.16 లక్షల లడ్డూల విక్రయాలు జరిగాయి. ఇక మొన్న 21వ తేదీ రోజున 3.66 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. ఇలా రోజు రోజుకు లడ్డులా కొనుగోలు ఎక్కువ అవుతూనే ఉంది.
Read Also : Tirumala : టీటీడీ గత పాలకులు అసలు హిందువులే కాదు – రేసుగుర్రం విలన్