Bedroom politics : ఏపీ రాజకీయాల్లో బెడ్ రూమ్ మసాలా! YSR రెండోకాపురంపై జనసేన వీడియో
రాజకీయాలను జనసేన, వైసీపీ పర్సనల్ లైఫ్ లోకి(Bedroom politics)జగన్మోహన్ రెడ్డి,పవన్ వ్యక్తిగత,ప్రైవేటు జీవితాల్లోకి వెళ్లింది.
- By CS Rao Published Date - 02:27 PM, Sat - 1 July 23
ఏపీ రాజకీయాలను జనసేన, వైసీపీ పర్సనల్ లైఫ్ లోకి(Bedroom politics) తీసుకెళ్లాయి. పరస్పరం జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ వ్యక్తిగత, ప్రైవేటు జీవితాల్లోకి వెళ్లింది. అంతేకాదు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నడిపిన ప్రైవేటు జీవితాన్ని కూడా జనసేన బయటకు లాగింది. దీంతో ఆ రెండు పార్టీల మధ్య పర్సనల్ వార్ నడుస్తోంది. ఆ క్రమంలో సోషల్ మీడియాలో వస్తోన్న న్యూస్ బెడ్ రూంలను తొంగిచూస్తోంది. అంతేకాదు, కుటుంబంలోని మహిళలను కూడా బజారుకు లాగుతున్నారు. అక్రమ సంబంధాలను అంటగడుతూ జుగుప్సాకర పోస్ట్ లను పెడుతూ రాజకీయాలను వెగటుపుట్టిస్తున్నారు.
ఏపీ రాజకీయాలను జనసేన, వైసీపీ పర్సనల్ లైఫ్ లోకి(Bedroom politics)
శ్రీకాకుళం జిల్లా కురుపాంలో జరిగిన అమ్మఒడి సభలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం వివాదస్పదం అయింది. పిల్లలు, తల్లులు పాల్గొన్న ఆ సమావేశంలో పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించారు. అంతేకాదు, పవన్ మాదిరిగా నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేను, మీసాలు తిప్పలేను, తొడలు కట్టలేను..అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో పాపం పసివాడు అంటూ మొదలు పెట్టిన పవన్ తాజాగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితంలోకి (Bedroom politics) వెళ్లారు. `మిస్టర్ జగన్ చెవులు విప్పుకుని విను. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావు. నీ వ్యక్తిగత జీవితంలో ప్రతిక్షణం నాకు తెలుసు… మాట్లాడమంటావా? మీ నాయకులు ఎవరినైనా పంపించు… చెబుతాను! నీ వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్పేది వింటే చెవుల్లోంచి రక్తం వస్తుంది జాగ్రత్త! అంటూ సీరియస్ వార్నింగ్ ఇవ్వడానికి అనుగుణంగా సోషల్ మీడియాలో పోస్టులు షేక్ చేస్తున్నాయి.
వ్యక్తిగత జీవితాల గురించి పనికిమాలిన మాటలు
“జగన్… నీకే చెబుతున్నా. నువ్వు ఇలాగే వ్యక్తిగత జీవితాల గురించి పనికిమాలిన మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. ఇది గట్టి వార్నింగ్ అనుకో. బలమైన పోరాటం ఇవ్వబోతున్నాం… సిద్ధంగా ఉండు” అని పవన్ స్పష్టం చేయడం జనసైనికులకు ఊపునిచ్చింది. గతంతో పోల్చితే తమ వాళ్లు బైక్ సైలెన్సర్లు తీసేసి తిరగడం తగ్గిందని, వైసీపీ నేతల నోట్లో సైలెన్సర్లు తగ్గిస్తే తమ వాళ్లు పూర్తిగా తగ్గిస్తారని చెబుతూ చూసుకుందాం…ప్రైవేటు లైఫ్ గురించి అంటూ (Bedroom politics) సవాల్ విసరడం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని దారుణాలను చూడాల్సి వస్తుందనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెన్నై కేంద్రంగా జయచిత్రతో ఎఫైర్ ఆధారాలతో జనసేన
సినిమా హీరోయిన్ల ఫోటోలతో కూడిన జగన్మోహన్ రెడ్డి ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. జనసేనాని పవన్ పెళ్లిళ్లు, రేణూదేశాయ్ కామెంట్లు, పూనమ్ కౌర్ ట్వీట్లను బయటకు తీస్తున్నారు. తనతో సంసారం చేస్తూ వేరే వాళ్లతో పిల్లల్ని కనడం ఏమిటి? అంటూ రేణూదేశాయ్ ఇంటర్వ్యూల్లో చెప్పిన వీడియోలను.(Bedroom politics) వైరల్ చేస్తున్నారు. ప్రతిగా జగన్మోహన్ రెడ్డి హీరోయిన్లు నయనతార, అనుష్క తదితరతో ఉన్నట్టు ఫోటోలను పెడుతూ ప్రైవేటు జీవితాల్లోకి జనసేన కూడా వెళ్లింది.
Also Read : TDP : చంద్రబాబు పీఏ సహా 45 మంది కేసు నమోదు
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెన్నై కేంద్రంగా అప్పట్లో జయచిత్రతో ఎఫైర్ నడిపిన విషయాన్ని ఆధారాలతో జనసేన కార్యకర్త , సీనియర్ జర్నలిస్ట్ పేరుతో ఒక వీడియోను ఆ పార్టీ వైరల్ చేస్తోంది. భర్త, పిల్లలు ఉన్న జయచిత్రను భయపెట్టి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కాపురం చేసింది నిజం కాదా? చెప్పండంటూ.(Bedroom politics) వైసీపీని నిలదీస్తున్నారు. ఇలా, వ్యక్తిగత, ప్రైవేటు జీవితాల్లోకి వెళుతూ బెడ్ రూం కబుర్లను ఏపీ రాజకీయాల్లోకి తీసుకొస్తూ మసాల దట్టిస్తున్నారు. ఈ పరిణామం ఎంత వరకు వెళుతుందో చూడాలి.
Also Read : Janasena fever : డిప్రషన్లో పవన్ ? సోషల్ మీడియాలో YCP దుమారం!!
Related News
Ambati Rambabu: అంబటి రాంబాబుకి బిగ్ షాక్.. మామకు ఓటు వేయొద్దు అని అల్లుడు వీడియో..!
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది.