HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bad News For Ap Train Passengers

AP Train Passengers : ఏపీ రైలు ప్రయాణికులకు చేదువార్త

AP Train Passengers : విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న రైల్వే లైన్ పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకున్నాయి

  • By Sudheer Published Date - 02:45 PM, Fri - 8 August 25
  • daily-hunt
Kodangal To Goa Train
Kodangal To Goa Train

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రయాణికులకు (Passengers ) ముఖ్యమైన గమనిక. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న రైల్వే లైన్ పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కృష్ణా కెనాల్ నుండి గూడూరు వరకు మూడో లైన్ నిర్మాణం జరుగుతోంది, దీని వల్ల కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు, మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. గూడూరు నుంచి చుండూరు వరకు మొదటి దశ పనులు పూర్తవగా, ప్రస్తుతం పెదవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి మీదుగా చుండూరుకు మూడో లైన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ మార్పుల వల్ల తెనాలి మీదుగా నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు జరిగాయి.

Kohli New Look : తెల్లగడ్డం తో కోహ్లీ న్యూ లుక్

ఈ రైల్వే పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేయబడ్డాయి. ఆగస్టు 8 నుంచి 19వ తేదీ వరకు విజయవాడ నుంచి తెనాలి మీదుగా ఒంగోలు, గూడూరు వెళ్లే ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. అలాగే, ఆగస్టు 8 నుంచి 24వ తేదీ వరకు గుంటూరు నుంచి తెనాలి మీదుగా రేపల్లె వెళ్లే ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దు చేయబడ్డాయి. ఆగస్టు 11 నుంచి 19 వరకు రేపల్లె – సికింద్రాబాద్ మధ్య నడిచే డెల్టా ఎక్స్‌ప్రెస్ రైళ్లు గుంటూరు వరకు మాత్రమే నడుస్తాయి. కొన్ని సుదూర రైళ్లు కూడా రద్దు చేయబడ్డాయి, వాటిలో తిరుపతి-ఆదిలాబాద్ (17405/17406) రైలు, తిరుపతి-విశాఖపట్నం (22707/22708) రైలు, మరికొన్ని ఉన్నాయి.

Phone Tapping Case : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిఘా

రద్దు చేయబడిన రైళ్లతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఆగస్టు 9 నుంచి 19వ తేదీ వరకు విశాఖపట్నం నుంచి లింగంపల్లి నడుమ నడిచే రెండు రైళ్లు తెనాలి మీదుగా కాకుండా నేరుగా గుంటూరు నుంచి విజయవాడకు వెళ్తాయి. అలాగే, ఆగస్టు 25, 26, 28 తేదీల్లో రేణిగుంట-నిజాముద్దీన్ (00761) రైలు, ఆగస్టు 26న హౌరా-తిరుపతి (20889), పూరి-తిరుపతి (22859) రైళ్లు, ఆగస్టు 27న సంత్రాగచి-తిరుపతి (22855) రైలు, ఆగస్టు 28న తిరుపతి-భువనేశ్వర్ (22872) రైలు కృష్ణాకెనాల్, న్యూ గుంటూరు, తెనాలి మీదుగా దారి మళ్లించబడ్డాయి. ఈ మార్పులను ప్రయాణికులు గమనించి, తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Train Passengers
  • Bad News
  • Changes in the movement of several trains due to railway line works
  • Tenali

Related News

    Latest News

    • PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

    • Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్‌, హారిస్ రౌఫ్‌కు షాకిచ్చిన ఐసీసీ!

    • SIR : SIRకు వ్యతిరేకంగా బెంగాల్లో భారీ ర్యాలీ

    Trending News

      • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

      • Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

      • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

      • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

      • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd