Jagan : జగన్ను అష్టదిగ్బంధనం చేయబోతున్న బాబు..?
Jagan : ప్రభుత్వ హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ, వైసీపీ నేతలను అయిదు వారాలపాటు ప్రజల్లోకి పంపేందుకు జగన్ పిలుపునిచ్చారు
- By Sudheer Published Date - 11:02 AM, Fri - 27 June 25

ఏపీ రాజకీయాలు (AP Politics) మరో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు “ఇది మంచి ప్రభుత్వం” (Idhi Manchi Prabhutvam ) పేరిట ఎమ్మెల్యేలను ప్రజల్లోకి పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడంతోపాటు, ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. జూలై 2నుంచి ఈ ప్రచార యాత్ర ప్రారంభం కానుంది. దీనికి ముందుగానే ఈ నెల 29న టీడీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి నాయకులకు పూర్తి మార్గదర్శకాన్ని అందించనున్నారు.
Puri Jagannath : వైభవంగా ప్రారంభమైన పూరీలో జగన్నాథ రథయాత్ర
ఇదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ సైతం కౌంటర్ రాజకీయం మొదలుపెట్టారు. “చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేద్దాం” (Chandrababu Manifesto Gurthucheddam) అనే కార్యక్రమం ద్వారా ప్రజల మద్దతు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ, వైసీపీ నేతలను అయిదు వారాలపాటు ప్రజల్లోకి పంపేందుకు జగన్ పిలుపునిచ్చారు. ఈ ప్రణాళిక ప్రకారం ప్రజలకు హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని, టీడీపీ దుష్ప్రచారాన్ని నిలిపివేయాలని వైసీపీ భావిస్తోంది.
ఇక ఈ రెండు ప్రధాన పార్టీల ప్రచార యత్నాలు ఒకదానికొకటి కౌంటర్ లా మారడంతో రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ వర్గాలు జగన్ పర్యటనల్లో చోటుచేసుకున్న సంఘటనలు – సత్తెనపల్లి ఘటన, సింగయ్య మరణం లాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నాయి. మరోవైపు జగన్ పై కేసుల విచారణ హైకోర్టులో కొనసాగుతోంది. ఇదంతా చూస్తే ప్రజల్లో తన పాదముద్ర వేసేందుకు జగన్ – చంద్రబాబు మధ్య తలపడటం కొత్త మలుపు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.