YSRCP Attack : జగన్ ఇలాఖాలో అరాచకం
ఏపీ సీఎం జగన్ నివసించే ప్రాంతంలో వృద్ధులు, మహిళలపై జరిగిన దాడి హృదవిదారకంగా ఉంది.
- Author : CS Rao
Date : 30-04-2022 - 5:08 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్ నివసించే ప్రాంతంలో వృద్ధులు, మహిళలపై జరిగిన దాడి హృదవిదారకంగా ఉంది. ప్రైవేటు వివాదంలోకి చొరబడి ఒక యువకుడు చేసిన గుండాగిరీ జగన్ సర్కార్ ను ప్రశ్నించేలా ఉంది. సాక్షి పత్రికకు సంబంధం ఉన్న ఆ యువకుడు చేసిన దాడి వీడియోను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇదిగో సాక్షి గూండాల బరితెగింపు….! అది కూడా స్వయంగా సాక్షి యజమాని సీఎం నివశించే తాడేపల్లిలో! ప్రైవేటు వివాదంలో వేలు పెట్టి… వృద్ధుడు, మహిళలపై దాడి. అధికార మదం తో పెట్రేగుతున్న ఇలాంటి మీడియా ముసుగు అరాచకాలను కట్టడి చేయలేరా @ysjagan pic.twitter.com/oYILp7AJr2
— N Chandrababu Naidu (@ncbn) April 30, 2022
`ఇదిగో సాక్షి గూండాల బరితెగింపు….! అది కూడా స్వయంగా సాక్షి యజమాని సీఎం నివశించే తాడేపల్లిలో! ప్రైవేటు వివాదంలో వేలు పెట్టి… వృద్ధుడు, మహిళలపై దాడి. అధికార మదం తో పెట్రేగుతున్న ఇలాంటి మీడియా ముసుగు అరాచకాలను కట్టడి చేయలేరా` అంటూ చంద్రబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
శ్రీకాళహస్తి పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ కు వెళుతున్న టిడిపి నేతలపై దాడిని ఖండిస్తున్నాను. నామినేషన్ కు వెళుతున్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి చలపతి నాయుడు పై వైసిపి గూండాలు దాడిచెయ్యడం, కారు ధ్వంసం చెయ్యడం హేయమైన చర్య.(1/2) pic.twitter.com/qnL4v7snub
— N Chandrababu Naidu (@ncbn) April 30, 2022
కాళహస్తి పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ కు వెళుతున్న టిడిపి నేతలపై దాడిని ట్వీట్టర్ వేదికగా చంద్రబాబు ఖండించారు. నామినేషన్ కు వెళుతున్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి చలపతి నాయుడు పై వైసిపి గూండాలు దాడిచెయ్యడం, కారు ధ్వంసం చెయ్యడం హేయమైన చర్య అంటూ ఆ వీడియోను ట్వీటర్లో షేర్ చేశారు. తాడేపల్లి కేంద్రంగా సాక్షి యువకుడు చేసిన దాడి, కాళహస్తి పాల సొసైటీ ఎన్నికల్లో వైసీపీ క్యాడర్ అరాచకాల వీడియోలను చంద్రబాబు ట్వీటర్ వేదికగా షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టేలా ఆ వీడియోలు కనిపిస్తున్నాయి.