AP : చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై నేడు ACB కోర్టులో వాదనలు..
ఈరోజు బెయిల్ పిటిషన్ ఫై ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో బాబు బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణ జరగనుంది
- By Sudheer Published Date - 10:37 AM, Fri - 6 October 23

గత కొద్దీ రోజులుగా ఏసీబీ కోర్ట్ (ACB Court) లో చంద్రబాబు (Chandrababu) కస్టడీ, పిటిషన్ల మీద వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి తప్ప బెయిల్ ఫై ఓ స్పష్టత మాత్రం రావడం లేదు. ఈరోజు మరోసారి న్యాయమూర్తి ముందు చంద్రబాబు తరుపు లాయర్లు , ప్రభుత్వం తరుపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. ఈరోజు బెయిల్ పిటిషన్ (Chandrababu Bail Petition) ఫై ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో బాబు బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణ జరగనుంది. అలాగే ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ మీద కూడా విచారణ జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఈరోజు రాజమండ్రి సెంట్రోల్ జైల్లో ఉన్న చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణిలు కలవనున్నారు. నారా లోకేశ్ అమరావతి నుంచి రాజమండ్రికి బయల్దేరారు. లోకేశ్ తో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు, దేవినేని ఉమా, వైవీబీ రాజేంద్రప్రసాద్, కొల్లు రవీంద్ర, ఆదిరెడ్డి వాసు, భాష్యం ప్రవీణ్, బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు కూడా రాజమండ్రికి పయనమయ్యారు. రోడ్డు మార్గంలో వీరు రాజమండ్రికి వెళ్తున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు ను కలవనున్నారు. భవిష్యత్ కార్యాచరణతో పాటు, పలు అంశాలపై చంద్రబాబుతో లోకేశ్ చర్చించనున్నారు.
Read Also : New Search Feature : వాట్సాప్ అప్ డేట్స్ ట్యాబ్ లో ‘సెర్చ్’ ఫీచర్