HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Apl Startb From June 9th In Vizag

APL : జూన్ 9 నుంచి ఏపీఎల్ 2026.. విశాఖ వేదికగా ప్రారంభం

  • Author : Prasad Date : 29-05-2026 - 8:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
APL 2026
APL 2026

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2026 జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు ప్రతిభ చాటుకునే వేదికగా నిలిచే ఈ టోర్నీకి విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. ఏపీఎల్-2026 అధికారిక షెడ్యూల్‌ను ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.వి. సుజయ్ కృష్ణ రంగారావు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు ఈ లీగ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ టోర్నీలో మొత్తం ఏడు ఫ్రాంచైజీ జట్లు పోటీపడనున్నాయి. భీమవరం బుల్స్, రాయలసీమ రాయల్స్, విజయవాడ సన్‌షైనర్స్, అమరావతి రాయల్స్, సింహాద్రి లయన్స్, కాకినాడ కింగ్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. మ్యాచ్‌లు విశాఖపట్నం, కడప, మంగళగిరి వేదికల్లో నిర్వహించనున్నారు. రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించనుంది. ప్రస్తుతం అన్ని ఫ్రాంచైజీ జట్లు ప్రాక్టీస్ సెషన్లలో బిజీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఏపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్ బాబు నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి మరో మైలురాయిగా నిలవనుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACA
  • Andhra Cricket Association
  • Andhra Premier League
  • APL
  • APL 2026

Related News

    Latest News

    • ‘Aakash’ Educational Gift : దేశ రక్షణ దళాలకు ‘ఆకాశ్’ విద్యా కానుక

    • Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

    • Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

    • Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాట‌వేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు

    • Congress : క‌ర్ణాట‌క రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం. డిప్యూటీ సీఎం ప‌ద‌వి త‌న కుమారుడికి ఇవ్వాలంటున్న సిద్ధా

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd