APCRDA : సూరంపల్లిలో అనధికార లేఅవుట్లను తొలిగించిన ఏపీసీఆర్డీఏ
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో అనధికారికంగా వేసిన రియల్ ఎస్టేట్ లేఅవుట్‌లను ఏపీసీఆర్‌డీఏ అధికారులు
- By Prasad Published Date - 01:16 PM, Thu - 19 October 23

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో అనధికారికంగా వేసిన రియల్ ఎస్టేట్ లేఅవుట్‌లను ఏపీసీఆర్‌డీఏ అధికారులు తొలగించారు. ఏపీసీఆర్‌డీఏ నుంచి అనుమతి తీసుకోకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ వెంచర్లు వేశారు. దీంతో ప్రభుత్వంతో పాటు సీఆర్‌డీఏ కూడా ఈ అనధికార వెంచర్ల ద్వారా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ పరిధిలో అనధికార లేఅవుట్‌లను తొలగించాలని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు సూరంపల్లిలో అనధికారిక లేఅవుట్లను అధికారులు ధ్వంసం చేసి ఎక్స్‌కవేటర్ల సాయంతో సర్వే రాళ్లు, అంతర్గత రోడ్లను తొలగించారు.
We’re now on WhatsApp. Click to Join.
APCRDA కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. CRDA అధికారులు 126 (P), 134 (P), 137 (P), 140 (P), 141 (P) సర్వే నంబర్లలో రెండు అనధికార లేఅవుట్‌లు, సర్వే నంబర్ 308 వద్ద మరొకటి ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఏపీసీఆర్‌డీఏ అనుమతి లేకుండా ప్లాట్లు విక్రయించడం నేరమని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ లేఅవుట్లలో అనధికార ప్లాట్లు కొనుగోలు చేస్తే ప్రజలు నష్టపోతారని ఆయన సూచించారు. తదనంతరం చర్యలకు వారు కూడా బాధ్యులని చెప్పారు. ఇదిలా ఉండగా అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసే వారు ఎలాంటి భవన నిర్మాణాలు చేపట్టవద్దని కమిషనర్ సూచించారు. రోడ్లు, నీటి సదుపాయం, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించి, నిబంధనలు పాటించి వెంచర్లకు అనుమతులు ఇస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
Also Read: Chandrababu : చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగింపు