AP Formation Day: ప్రజలకు ప్రధాని మోడీ,సీఎం జగన్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
- By Hashtag U Published Date - 11:18 AM, Mon - 1 November 21

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజల నైపుణ్యం, సంకల్పం, పట్టుదలకు మారు పేరు అని అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నానని ట్విట్టర్లో తెలిపారు.
https://twitter.com/narendramodi/status/1454973722868293634
రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర అవతరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగం, ఎందరో పోరాటాల ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమని.. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని వైఎస్ జగన్ అన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములుగారి లాంటి ఎంతోమంది మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం. వారు సాధించిన ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీ అందరి సహకారంతో అడుగులు ముందుకు వేస్తున్నా.#APformationday
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2021
CM Jagan pays tributes to Potti Sriramulu statue at CM's camp office on Andhra Pradesh State Formation Day#APformationday pic.twitter.com/eIOoT0xKS0
— YS Jagan Cares (@ysjagancares777) November 1, 2021
Related News

CM Jagan : నేడు దుర్గగుడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆయన