HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Roads People Fires On Cm Jagan

AP Roads : సీఎం జగన్ కు వర్షాలు మరో తలనొప్పి తెచ్చిపెట్టాయి

సీఎం జగన్ కు ఇప్పుడు వర్షాలు పెద్ద తలనొప్పిగా మారాయి

  • Author : Sudheer Date : 23-07-2023 - 1:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
People Fires on CM Jagan
People Fires on CM Jagan

సీఎం జగన్ (CM Jagan) కు ఇప్పుడు వర్షాలు పెద్ద తలనొప్పిగా మారాయి. అదేంటి అనుకుంటున్నారా..? రాష్ట్రంలో రోడ్ల (AP Roads) పరిస్థితి ఎలా ఉందనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వైస్సార్సీపీ అధికారం చేపట్టిన దగ్గరి నుండి కూడా ప్రజలు రోడ్లు బాగు చేయాలనీ కోరుతున్నారు. గల్లీ రోడ్లే కాదు మెయిన్ రోడ్లు సైతం దారుణంగా ఉన్నాయి. గత ఏడాది వర్ష కాల (Rainy Season) సమయంలో పెద్ద ఎత్తున రోడ్ల విషయంలో ప్రజలు ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో ఉన్న డబ్బుతో అక్కడక్కడా రోడ్లు వేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ వర్షాలు మొదలుకావడం తో ఎక్కడ చూసిన రోడ్లు గుంతలతో దర్శనం ఇస్తున్నాయి. రోడ్ల ఫై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది.

తాజాగా ఏలూరు లో రోడ్ల పరిస్థితిపై ఓ యువకుడు వినూత్న నిరసన చేపట్టాడు. రోడ్డుపై నీళ్లు నిలిచి ఉన్న గుంతలో నవారు మంచం వేసుకుని యువకుడు (Young Man) నిరసన తెలిపాడు. దీంతో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు గంటసేపు ఆగిపోయింది. తర్వాత ఆర్టీసీ డ్రైవర్, స్థానికులు నచ్చచెప్పడంతో యువకుడు వెనక్కి తగ్గాడు. రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని లేదా నూతన రోడ్డు నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినలేదని, అందుకే అందరికీ తెలిసేందుకు ఇలా చేసినట్లు యవకుడు తెలిపాడు. కేవలం ఏలూరు లో మాత్రమే కాదు రాష్ట్రంలో రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. రోడ్లు బాగుచేయాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని వారంతా వాపోతున్నారు.

ఇప్పటికే సీఎం జగన్ అనేక సమస్యలతో ఫ్రస్టేషన్ లో ఉన్నాడు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ,,వైస్సార్సీపీ పార్టీ ని గద్దె దించాలని చూస్తున్నాయి. ప్రజల్లోనూ అధికార పార్టీ ఫై వ్యతిరేకత ఉంది. వీటి నుండి ఎలా బయటపడేలా అని జగన్ ఆలోచిస్తుంటే..ఇప్పుడు వర్షాల వల్ల రోడ్లు దారుణంగా మారాయి. ప్రతిపక్షాలకు మరో ఆయుధంలా రోడ్ల దొరికాయి. మరి జగన్ ఏంచేస్తారో…రోడ్లు వేస్తారా..లేక అలాగే వదిలేస్తారా..? అనేది చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • ap roads
  • cm jagan
  • Danger Situation
  • People Fires
  • rainy season

Related News

These are the vegetables you should eat more of during the monsoon season.

Rainy Season Vegetables: వర్షాకాలంలో ఎక్కువగా తినాల్సిన కూరగాయలు ఇవే..

వర్షాకాలంలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. తాగే నీటిని వేడి చేసి తాగాలి. వర్షాకాలంలో మాంసాహారం తింటే అరగదు కాబట్టి ఎక్కువగా శాఖాహారం మాత్రమే తినాలి. వర్షాకాలంలో ఎక్కువగా తినాల్సిన కూరగాయలు గుమ్మడికాయ, ఉసిరి, కాకరకాయ, బీన్స్, బెండకాయ. పెస్టిసైడ్స్ స్ప్రే చేసిన కూరగాయలను వర్షాకాలంలో వాడకూడదు. గుమ్మడికాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో త్వరగా జీర్ణమవుతుంది

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

Latest News

  • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

  • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd