Gowtham Sawang : బూతు రాజకీయంలో పోలీస్
ఏపీ రాజకీయాల్లో హుందాతనం పోయింది. బూతులు వాడటం మామూలు అయింది.
- By CS Rao Published Date - 09:59 PM, Mon - 24 January 22

ఏపీ రాజకీయాల్లో హుందాతనం పోయింది. బూతులు వాడటం మామూలు అయింది. మంత్రి కొడాలి నాని బూతులు మంత్రిగా పేరుపడ్డాడు. ఆయన్ను మించి ఇటీవల టీడీపీ లీడర్లు పోటీ పడి కోడాలిని తిట్టారు. సోషల్ మీడియా వేదికగా కుటుంబ సభ్యులను కూడా బజారున వేశారు. ఇందులో ఒకరు ఎక్కువ ఇంకొకళ్ళు తక్కువ గా ఏమి చూడాల్సిన అవసరం లేదు. నిక్కచ్చిగా చెప్పాలి అంటే ఇద్దరు ఒకటే రేంజ్.పరస్పరం రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సర్వ సాధారణం. ప్రచారంలో దీన్నో ఎత్తుగడగా పార్టీలు భావిస్తుంటాయి. కానీ, ఇప్పుడు బండ బూతులు ఎవరు తిట్టగలరో..వాళ్ళ రాజకీయ గ్లామర్ పెరుగుతుంది అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వర్ల రామయ్యను దాటి వెళ్లారు కొందరు టీడీపీ కొత్త లీడర్ లు. బొస్డీకే నుంచి అమ్మ..అలీ..ల..కొడకా తదితర బూతులు ఈజీగా వాడేస్తున్నారు. మీడియా కూడా ఏమాత్రం కట్ చేయకుండా ప్రజలకు చూపిస్తున్నారు.
రాజకీయాల్లోకి పోలీసులను తరచూ లాగడం కూడా మామూలు అయింది. ఆనాడు టీడీపి అధికారం లో ఉన్నప్పుడు జగన్ ఏపీ పోలీస్ పని తీరును నమ్మలేదు. అందుకే , కోడి కత్తి నుంచి బాబాయ్ హత్య వరకు జరిగిన సంఘటనలపై విచారణ ను నమ్మవద్దు అంటూ పిలుపు ఇచ్చాడు. పోలీస్ అధికారులపై కళ్లెర్ర చేసి వాళ్ళమీదకు దూకిన సందర్భాలు లేకపోలేదు. పోలీస్ కలర్ పట్టుకొని , వాళ్ళ మీద ఫైల్స్ విసిరి కొట్టిన సంఘటనలు ఉన్నాయి. ఏపీ పోలీస్ అంటే చంద్రబాబు పోలీస్ అని, తెలుగు దేశం పోలీస్ అని రకరకాలుగా ఆనాడు సీబీఐ ని కూడా వదలకుండా ఆరోపణలు చేశారు వైసీపీ లీడర్లు. ఇప్పుడు సీన్ రివర్స్ గా మారింది. ఆ రోజున ఏపీ పోలీస్ పని తీరును ప్రశంసించిన టీడీపీ లీడర్లు ఇప్పుడు ఏపీ పోలీస్ ను నమ్మడం లేదు. వాళ్ల మీద విశ్వాసం లేదని చెబుతున్నారు. పైగా ఆ డిపార్ట్మెంట్ లో సీఐ స్థాయి వరకు పని చేసిన వర్ల రామయ్య కూడా పోలీస్ తీరును విమర్శించడం గమనార్హం. మళ్ళీ సెక్యురిటి లేకుండా ఈ రాజకీయనాయకులు బయటకు వెళ్ళలేరు. పద్ధతి లేకుండా ఎవరు పడితే వాళ్లు పోలీస్ ను కూడా అధికార పార్టీ లీడర్స్ తో కలిపి అవమానించడం అలవాటు అయింది.
ఇప్పుడు బుద్దా వెంకన్న గురించి తీసుకుంటే,అతనో మామూలు లీడర్. ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎక్కడ గెలవలేదు. ఏదో సామాజిక ఈక్వేషన్ వేసే చంద్రబాబు టీడీపీ పదవిని ఇచ్చాడు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవి వచ్చింది. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో తొలి నిందితుడు. ఆ రోజున అతనిపై వచ్చిన ఆరోపణలపై పోలీస్ సరిగా విచారణ చేయలేదని వైసీపీ ఆరోపించింది. ఆ తరువాత 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం పోయింది. అప్పటి నుంచి అంతర్గత పోరాటం టీడీపీ లొనే ప్రారంభం అయింది. ఆ క్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ఒక లీడర్ బుద్దకు అండగా ఉంటూ వైసీపీ లీడర్లపై బూతు లు తిట్టడానికి ఉపయోగించారు. దీంతో సీనియర్ లీడర్ గా ఫోకస్ అయ్యే ప్రయత్నం చేసాడు. ఆ మూడ్ లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అని కూడా ఆలోచించకుండా అదుపుతప్పి ఆరోపణలు చేసాడు. గుడివాడలో జరిగిన కాసినో గేమ్ లో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు వాటా ఉందని నోరు అదుపు తప్పిన మాటలు ఉపాయోగించాడు. అంతేకాదు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఆ పదవికి ఉన్న హోదా మీద దాడికి దిగాడు. గతంలోనూ డీజీపీ మీద చాలా దురుసుగా వ్యవహరించిన సందర్భాలు లేకపోలేదు. అందుకే బుద్దా కు డీజీపీ అంటే ఏంటో చూపించాలి అని ఏపీ పోలీస్ నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. అలా అని పోలీస్ జులుమ్ ను సమర్ధించటం కాదు. అందరికి పోలీస్ రక్షణ అవసరం. నాయకులకు అడుగడుగునా వాళ్ల రక్షణ లేకుండా బయటకు వెళ్ళలేరు. కానీ , పోలీసు లను అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా చూడటం అలవాటుగా మారింది. ఇలాంటి పరిణామం పోలీస్ వ్యవస్థకు ఉండే సామర్ధ్యాన్ని అనుమనించేలా ఉంది. ఇది సమాజానికి మంచిది కాదు అనే విషయం రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. ఇప్పటికే ఒక సారి అరెస్ట్ అయిన పట్టాభి కి తెలిసింది. ఇప్పుడు బుద్దా వెంకన్న వంతు వచ్చింది. రాబోయే రోజుల్లో వర్ల వంతు కూడా వచ్చే ఛాన్స్ లేకపోలేదు. సో ..ఒక హద్దును దాటి రాజకీయ నాయకులపై బురద వేసినట్టు అధికారులపై వేస్తే ఇలాగే ఉంటుంది. మళ్ళీ ప్రతిపక్షం లోకి వస్తే వైసీపీ లీడర్లు కు కూడా ఇది భిన్నం కాదు. ఇరు పక్షాల మధ్య నలిగిపోతున్న పోలీస్ అధికారులను పాపం అనాల్సిందే.