AP Officers In Dilemma : నాడు వైఎస్ నేడు జగన్ ! బ్యూరోక్రాట్స్ లో దడ!!
AP Officers In Dilemma : చంద్రబాబు జైలు పాలయ్యేలా సీఎం జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. అందుకు ఏపీ సీఐడీ సంపూర్ణ సహకారం అందించింది.
- By CS Rao Published Date - 03:07 PM, Wed - 20 September 23

AP Officers In Dilemma : తెలుగుదేశం పార్టీ చంద్రబాబు జైలు పాలయ్యేలా సీఎం జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. అందుకు ఏపీ సీఐడీ సంపూర్ణ సహకారం అందించింది. గతంలోనూ అనేక మందిని అరెస్ట్ చేయడానికి ఆ విభాగం యాక్టివ్ గా పనిచేసింది. అప్పట్లో సీఐడీ చీఫ్ సునీల్, ఇప్పుడు సంజయ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేస్తున్నారు. కానీ, చట్టం పరిధిలోనే వాళ్లు వ్యవహరిస్తున్నారా? అంటే కాదనే వాదన వినిపిస్తోంది. అందుకు సంబంధించిన వాదనలు న్యాయస్థానాల్లో ఉన్నాయి. ఇదే పద్ధతి కొనసాగితే, అంతిమంగా ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు ఆన్ రికార్డ్ దొరుకుతారు.
గత నాలుగేళ్లుగా బ్యూరో క్రాట్స్ హైకోర్టు ఎదుట (AP Officers In Dilemma)
గత నాలుగేళ్లుగా పలువురు బ్యూరో క్రాట్స్ హైకోర్టు ఎదుట చేతులు (AP Officers In Dilemma) కట్టుకున్నారు. కొందరు బహిరంగ క్షమాపణ కోర్టుకు చెప్పారు. డీజీపీగా చేసిన సవాంగ్, చీఫ్ సెక్రటరీగా చేసిన నీలం సహానీ న్యాయస్థానం ఎదుట సంజాయిషీ చెప్పుకున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత చీఫ్ సెక్రటరీగా ఉన్న సుబ్రమణ్యం స్వచ్చంధంగా బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో ఇంచార్జి సీఎస్ గా నీరవ్ కుమార్ కొంత కాలం ఉన్నారు. కానీ, సీఎంవో ఆఫీస్ ఒత్తిడి తట్టుకోలేక సెలవు పెట్టాలని అనుకుంటోన్న టైమ్ లో ఢిల్లీ నుంచి నీలం సహానీ సీఎస్ గా అపాయింట్ అయ్యారు. కొన్ని సందర్భాల్లో హైకోర్టు మెట్లు ఎక్కుతూ సీఎస్ గా అయిష్టంగా కొనసాగారని అప్పట్లో సచివాలయం వేదికగా చర్చ జరిగింది. ఆమె తరువాత సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డి సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు స్కిల్ డవలెప్మెంట్ కేసుకు సంబంధించిన ఫైల్స్ ను అందించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. లేదంటే, ఆయన కోర్టులకు హాజరు కావాలి.
డీజీపీల విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి
ఏపీ డీజీపీల విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటోన్న నిర్ణయాలు (AP Officers In Dilemma) వివాదస్పదం అవుతున్నాయి. తొలుత గౌతమ్ సవాంగ్ ను సీఎంగా జగన్మోహన్ రెడ్డి అయిన తరువాత నియమించుకున్నారు. అప్పటి వరకు ఉన్న డీజీపీని లూప్ లైన్లోకి పంపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీపీఎస్ రద్దు కోసం ధర్నా చేసిన సందర్భంగా సవాంగ్ ను పక్కకు తప్పించారు. ఆయన స్థానంలో రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారు. ఇప్పుడు ఆయన డీజీపీగా కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఏపీ సీఐడీ చంద్రబాబును జైలుకు పంపింది. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ఏపీ పోలీస్ అరెస్ట్ చేసింది. అందుకు సంబంధించిన రికార్డ్ లు, వివరాలు అన్నీ ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని వచ్చే ప్రభుత్వం కేసులను రివ్యూ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటికే కోర్టుల్లో నలుగుతోన్న కేసుల కారణంగా సవాంగ్ పలుమార్లు కోర్టులకు హాజరయ్యారు. ఇటీవల రాజేంద్రనాథ్ రెడ్డి మీద కూడా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
రూల్ ఆఫ్ లా ఏపీలో
రూల్ ఆఫ్ లా ఏపీలో లేదని పదవీ విరమణ చేసిన రాకేశ్ శర్మ రెండేళ్ల క్రితమే సుప్రీం కోర్టుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాజాగా ప్రభుత్వం ఉద్యోగుల సంఘం నేతలు సూర్యనారాయణ మీద కక్ష్య సాధింపుకు ఏపీ సర్కార్ పాల్పడిందని సుప్రీం కో్ర్టు అభిప్రాయపడింది. ఏపీలోని లా అండ్ ఆర్డర్ ప్రశ్నార్థకంగా ఉందని అత్యున్నత న్యాయస్థానం కామెంట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాలతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారులు, బ్యూరో క్రాట్స్ భవిష్యత్ లో మూల్యం (AP Officers In Dilemma) చెల్లించుకోవాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంను గుర్తు చేసుకుంటే డజను మందికి పైగా బ్యూరో క్రాట్స్ విచారణను ఎదుర్కొన్నారు.
Also Read : Modi Tour: వచ్చే నెల తెలంగాణకు మోడీ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటన
అప్పట్లో రాజశేఖర్ రెడ్డి మౌఖిక ఆదేశాల మేరకు ఓబులాపురం మైనింగ్, వాన్ పిక్ , జలయజ్ఞం తదితరాల్లో అడ్డగోలుగా జీవోలను ఇచ్చారు. వాటి మీద విచారణ సందర్భంగా డజను మందికి పైగా బ్యూరో క్రాట్స్ న్యాయస్థానాల ముందు నిల్చున్నారు. ఐఏఎస్ శ్రీలక్ష్మీ జైలు జీవితం గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లోనే అనుభవాలను గుర్తు చేసుకుని బ్యూరో క్రాట్స్, ఉన్నతాధికారులు వ్యవహరించాలి. అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తే, అంతిమంగా చట్టం, న్యాయానికి దొరికేది అధికారులు. కానీ, ఇప్పుడు రామోజీరావు, శైలజ, మాజీ మంత్రి అచ్చెంనాయుడు, నారాయణ , లోకేష్ తదితరులను అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశామట. ప్రస్తుతం చంద్రబాబును జైలులో పెట్టిన విధంగా వాళ్లను కూడా యుద్ధ ప్రాతిపదికన జైలుకు పంపాలని మౌఖిక సంకేతాలు ఇవ్వడం బ్యూరో క్రాట్స్ ను ఆందోళనకు గురి చేస్తోందట.
Also Read : Women’s Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన AIMIM