HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Mega Dsc Deadline Ends Guess How Many Applications Were Received

AP Mega DSC: ముగిసిన ఏపీ మెగా డీఎస్సీ గడువు… ఎన్ని దరఖాస్తులు అంటే?

ఏపీ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారి నుంచి మొత్తం 5,67,067 దరఖాస్తులు అందాయి.

  • Author : Kode Mohan Sai Date : 16-05-2025 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Mega Dsc
Ap Mega Dsc

AP Mega DSC: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ( AP Mega DSC) దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. ఈ అభ్యర్థుల నుంచి మొత్తం 5,67,067 దరఖాస్తులు వచ్చాయి. చాలామంది అభ్యర్థులు ఒకేసారి ఎస్జీటీ (SGT), స్కూల్ అసిస్టెంట్ (School Assistant), పీజీటీ (PGT) పోస్టులకు దరఖాస్తు చేయడంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువైంది.

దరఖాస్తుల తుది గణాంకాలు ఇంకా తేలాల్సి ఉంది. నిన్న అర్ధరాత్రి వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. డీఎస్సీని నిరవధికంగా, ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ధృడ నిశ్చయం చేసుకుంది. జూన్ 6 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది.

అయితే చాలామంది అభ్యర్థులు కనీసం 90 రోజుల పాటు పరీక్షలకు సన్నద్ధం కావడానికి గడువు కావాలని కోరుతున్నారు. మెగా డీఎస్సీ ప్రకటన వెలువడినప్పటి నుంచి నిరుద్యోగులు ఈ డిమాండ్‌ను చెబుతూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాకపోయినా, తాజాగా నారా లోకేష్ స్పందించారు. మెగా డీఎస్సీని ఆపేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కొన్ని వర్గాలు గడువు పెంచాలని కోరుతున్న మాట వాస్తవమేనని చెప్పారు. అయితే డిసెంబర్‌లోనే సిలబస్ విడుదల చేసినందున, అప్పటి నుంచి ఇప్పటికి ఏడు నెలలు పూర్తయినట్లు గుర్తు చేశారు.

ఈ వ్యాఖ్యలతో మెగా డీఎస్సీ గడువు పొడగింపు ఉండదని స్పష్టత వచ్చింది. ఈసారి ప్రభుత్వం భారీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుండటంతో, డీఎస్సీపై అభ్యర్థుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. పోటీ తీవ్రమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Mega DSC
  • AP Mega DSC 2025
  • CM Chandrababu
  • nara lokesh

Related News

Chandrababu Naidu Lays Foun

Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

Vizag : విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు రాష్ట్ర భవిష్యత్తుపై భారీ ఆశలు పెంచుతున్నాయి. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.1,583 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్‌ను కాగ్నిజెంట్ సంస్థ నిర్మించనుంది

  • Lokesh Foreign Tour

    Lokesh Foreign Tour : CIBC ప్రెసిడెంట్ తో నారా లోకేశ్ భేటీ

  • Nara Lokesh Meets Google Ce

    Lokesh US Tour : సుందర్ పిచాయ్, శంతను నారాయణన్‌లతో కీలక భేటీ

Latest News

  • లోక్‌స‌భ‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!

  • నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా

  • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

  • నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట!

  • ఫిలిం ఇండస్ట్రీ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సెన్సేషనల్ కామెంట్స్!

Trending News

    • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

    • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

    • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

    • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

    • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd