AP Liquor Scam : ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డికి షాక్
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ విషయంలో వెనుకడుగు పడింది.
- Author : Kavya Krishna
Date : 28-07-2025 - 8:01 IST
Published By : Hashtagu Telugu Desk
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ విషయంలో వెనుకడుగు పడింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ కేసులో ఏ38 నిందితుడిగా చెవిరెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అనంతరం బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం ఎదుట విచారణ జరగగా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించింది. సిట్ అభ్యంతరాలు, కేసు గంభీరతను పరిశీలించిన కోర్టు, చివరకు చెవిరెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉన్న సంబంధాలు, ఆధారాల ఆధారంగా ఆయనకు బెయిల్ ఇవ్వడం దర్యాప్తుకు అడ్డంకిగా మారవచ్చని సిట్ కోర్టుకు తెలిపింది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకుని కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఏపీ లిక్కర్ కేసు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు నిందితులు ఈ కేసులో అరెస్టు కాగా, చెవిరెడ్డి అరెస్ట్ మరింత హడావుడి రేపింది. బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఆయనకు చట్టపరమైన ఇబ్బందులు మరింత పెరిగాయి.
Auto Tips : మీరు మీ వాహనాన్ని ఫుల్ ట్యాంక్ పెట్రోల్‌తో నింపుతారా.? దీన్ని గుర్తుంచుకోండి..!