HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Liqour Scam Jagan

AP Liqour Scam : జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

AP Liqour Scam : ఆయనపై కేసులు, జైలుశిక్ష వంటి పరిణామాలు వాస్తవమైతే, జగన్ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అసాధ్యమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

  • Author : Sudheer Date : 05-05-2025 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Liqour Scam Target On
Ap Liqour Scam Target On

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను లిక్కర్ స్కాం అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ కావడం..అతడి విచారణలో కీలక విషయాలు బయటకు వస్తుండడంతో ఈ కేసుకు సంబంధించి అనేక మలుపులు తిరుగుతున్నాయి. మరోపక్క సిట్ (SIT) సైతం దర్యాప్తును మరింత వేగం చేసింది. ఇప్పటికే 29 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలాంటి వారిని కేసులో చేర్చడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చుట్టూ తిరగబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కసిరెడ్డి ఇచ్చిన వివరాల ఆధారంగా జగన్ పై కూడా కేసు నమోదు అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Kashmir Jails : జైళ్లపై ఉగ్రదాడికి కుట్ర.. ఉగ్రవాదులను విడిపించేందుకు స్కెచ్ ?

ఈ కేసు మాత్రమే కాదు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఇసుక స్కాం, భూకబ్జాలపై కూడా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. విశాఖపట్నంలో జరిగిన భూకబ్జాలపై ప్రత్యేక దృష్టితో విచారణ జరుగుతోంది. ఈ దర్యాప్తుల్లో పెద్ద నాయ‌కులు కూడా చిక్కుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తం పరిశీలిస్తే గత ప్రభుత్వాన్ని విచారించేందుకు ప్రస్తుత ప్రభుత్వం భారీ వ్యూహంతో ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ పై కేసులు పెట్టి, ఆయన్ని రాజకీయంగా అణచివేయాలన్న భావనతో కూటమి నేతలు పని చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇదిలా ఉండగా జగన్ తాను ఎదుర్కొనబోయే పరిస్థితులను ముందుగానే ఊహించి, పార్టీ బాధ్యతలను జిల్లా అధ్యక్షులు, పీఏసీ సభ్యులకు అప్పగించినట్టు సమాచారం. తాను దూరంగా ఉన్నా పార్టీ కార్యకలాపాలు కొనసాగేలా దిశానిర్దేశం చేశారు. ఇక 2012 మే నెలలో జగన్ అరెస్ట్ అయిన సంగతి గుర్తు చేస్తూ, ఇప్పుడూ మే నెల కావడం వల్ల రాజకీయంగా మరో సుదీర్ఘ ప్రయాణం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనపై కేసులు, జైలుశిక్ష వంటి పరిణామాలు వాస్తవమైతే, జగన్ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అసాధ్యమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఏపీలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP Liqour Scam
  • jagan
  • Jagan Arrest
  • Kasireddy arrest

Related News

    Latest News

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    Trending News

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd