AP law and order : మరో రియల్డర్ కిడ్నాప్, ఏపీ పోలీస్ కు సవాల్
ఏపీలో లా అండ్ ఆర్డర్ ను (AP law and order) ప్రశ్నించేలా మరో కిడ్నాప్ వెలుగుచూసింది. రియల్డర్ శ్రీనివాస్ ,లక్ష్మిని కిడ్నాప్ చేశారు.
- Author : CS Rao
Date : 29-06-2023 - 5:14 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో లా అండ్ ఆర్డర్ ను (AP law and order) ప్రశ్నించేలా మరో కిడ్నాప్ వెలుగుచూసింది. రియల్డర్ శ్రీనివాస్ తో పాటు ఆయన భార్య లోవ లక్ష్మిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. విశాఖ కేంద్రంగా జరిగిన ఈ సంఘటన కలవరపరుతోంది. రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ కిడ్నాప్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యానారయణ కుటుంబీకుల కిడ్నాప్ కథ ముగియకయుందే సేమ్ అటూ సేమ్ అలాంటిదే చోటుచేసుకోవడం గమనార్హం.
ఏపీలో లా అండ్ ఆర్డర్ ను ప్రశ్నించేలా మరో కిడ్నాప్(AP law and order)
తాజా కిడ్నాప్ విశాఖపట్నంలో జరిగింది. నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కిడ్నాప్ పోలీసులకు సైతం సవాల్ గా మారింది. రియల్డర్ శ్రీనివాస్ లక్ష్మి దంపతులను కిడ్నాప్ చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ నుంచి విశాఖకి వ్యాపారం నిమిత్తం ఆ దంపతులు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. 2021 జూన్లో విజయవాడలో శ్రీనివాస్ ను ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో రూ.3 కోట్లు శ్రీనివాస్ కాజేశాడని ఆరోపణలు వచ్చాయని ప్రాథమిక విచారణలో. (AP law and order) విశాఖ పోలీసులు తేల్చారు.
వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్యాపిల్లల కిడ్నాప్
కిడ్నాప్ చేసిన దండుగులు రూ.60 లక్షలు ఇవ్వాలని శ్రీనివాస్ దంపతులను డిమాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో నే ఈ కిడ్నాప్ చేసినట్టు పోలీసులు నిర్థారిస్తున్నారు. కేవలం వారాల వ్యవధిలోనే కిడ్నాప్లు ఘటన చోటుచేసుకోవడంపై సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని ఆయన స్నేహితుడు ప్రముఖ ఆడిటర్ను కిడ్నాప్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (AP law and order)భార్యాపిల్లల కిడ్నాప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో నిందితులపై కఠినంగా వ్యవహరించలేదనే విమర్శలు వచ్చాయి.
ఏపీలో వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదని వైసీపీ ఎంపీ
ఏపీలో వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. అంతేకాదు, ఇక విశాఖలో వ్యాపారాలను వదిలేసి హైదరాబాద్ కు వెళతానని కూడా వెల్లడించారు. ఆయన మీడియాకు ఇచ్చిన స్టేట్మెంట్ ను ఆధారంగా చేసుకుని ఏపీలోని లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? అనేది అద్దం పడుతోంది. ఇప్పుడు తాజాగా శ్రీనివాస్ , లక్ష్మీ దంపతుల కిడ్నాప్ చోటుచేసుకోవడం శాంతిభద్రతల పరిస్థితి (AP law and order) ప్రశ్నార్థకంగా ఉంది.
Also Read : AP Police : కేసు దర్యాప్తులో సూపర్ ఫాస్ట్ .. ఏపీ పోలీసుల మరో రికార్డు!!
ఏపీలో లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ లా ఎలా ఉంది? అనేది గతంలోనే జడ్జి రాకేష్ కుమార్ చెప్పారు. సుప్రీం కోర్టుకు కూడా లేఖ రూపంలో తెలియచేశారు. అప్పటి నుంచి కిడ్నాప్ లు, అక్రమ అరెస్ట్ లు, సీఐడీ పోలీస్ అరాచకాలు, ఎంపీ రఘురామక్రిష్ణం రాజు మీద దాడి తదితరాలన్నీ చూస్తున్నాం. ఇప్పుడు భూ, ఆర్థిక లావాదేవీల వ్యవహారం కిడ్నాప్ లకు. (AP law and order)దారితీస్తోంది. ఏపీ పోలీసులు మాత్రం శాంతి భద్రతలను భేషుగ్గా ఉన్నాయని చెప్పడం కొసమెరుపు.
Also Read : Police Power : పవన్ కు ఏపీ పోలీస్ నోటీసులు? హత్యకు కుట్రపై సీరియస్