AP Group 1: గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఏపీ హైకోర్టు పచ్చజెండా
ఏపీలో గ్రూప్-1 ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. తుది తీర్పునకు లోబడి నియామకాలు జరపాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
- By Hashtag U Published Date - 05:30 AM, Thu - 16 June 22

ఏపీలో గ్రూప్-1 ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. తుది తీర్పునకు లోబడి నియామకాలు జరపాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి 29 వరకు గ్రూప్-1 ఇంటర్వ్యూలను కొనసాగించాలని నిర్దేశించింది.వాటి నిలుపుదలకు నిరాకరించింది. పిటిషనర్ల సమాధాన పత్రాలను, మార్కుల వివరాలను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని హైకోర్టు సర్వీస్ కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్స్ సర్వీసుల్లో రీ వాల్యుయేషన్ లేదని, వాల్యుయేషన్‌లో ఎలాంటి తప్పులు జరగలేదని ఏపీపీఎస్సీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
కేసు దాఖలు కావడంతో..
గ్రూప్-1 పేపర్ల వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు దాఖలైంది. ఈ పిటిషన్లపై హైకోర్టులో తుది విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పై ఆదేశాలు ఇచ్చింది. గతంలో గ్రూప్-1 మెయిన్ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన వ్యాజ్యాలపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.