YSR Law Nestham : యువ న్యాయవాదుల అకౌంట్స్‌లోకి డబ్బులు ఇవాళే
YSR Law Nestham : ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను ఇవాళ విడుదల చేయనున్నారు.
- By Pasha Published Date - 08:55 AM, Mon - 11 December 23

YSR Law Nestham : ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను ఇవాళ విడుదల చేయనున్నారు. ఈ స్కీంలో భాగంగా కొత్తగా లా పూర్తి చేసిన యువ లాయర్లకు ఈ నగదును అందించనున్నారు. యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునే దాకా ఏడాదికి 60వేల చొప్పున రెండు విడతల్లో వైఎస్సార్ లానేస్తం సాయం అందుతుంది. ఏటా 60 వేల చొప్పున ఇలా మూడేళ్ల పాటు రూ. 1,80,000 స్టెఫండ్ వారికి లభిస్తుంది. ఏపీ అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్ సెక్రటరీలు సభ్యులుగా న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును’(YSR Law Nestham) రూ. 100 కోట్లతో ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టు ద్వారా న్యాయవాదులకు గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, వారికి అవసరానికి రుణాలు, ఇతర అవసరాల కోసం దాదాపు రూ.25 కోట్ల ఆర్థిక సాయం ఇప్పటికే అందించారు. ఇవాళ సీఎం జగన్ రెండో విడత నిధులను న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇవాళ సీఎం జగన్ విడుదల చేసేది జూలై- డిసెంబర్ కాలానికి సంబంధించిన సొమ్ము. దీన్ని నెలకు రూ. 5000 చొప్పున స్టైఫండ్ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది. ఆరు నెలలకు కలిపి ఒక్కొక్కరికి రూ. 30 వేలు చొప్పున ఇవాళ జమ చేయనున్నారు. దీని కింద 2807 మంది జూనియర్ న్యాయవాదులకు సహాయం అందుతుంది. వీరందరి బ్యాంకు ఖాతాల్లో రూ.8 కోట్లను జమ చేస్తారు.ఈ పథకానికి సంబంధించి ఇబ్బందులు ఉంటే 1902 నంబర్‌కు కాల్ చేయొచ్చు. ఈ ట్రస్ట్ కింద ఆర్థిక సాయం కావాలనుకునే అడ్వకేట్స్ ఆన్లైన్లో mailto:sec_law@ap.gov.in ద్వారా లా సెక్రటరీ కి అప్లై చేసుకోవచ్చు.