HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Govt Alotted 500 Crore To Kapu Nestham Scheme Annually

Kapu Nestham: ‘కాపు’ కార్పొరేషన్ మాయాజాలం!

పావలాకు రూపాయి లెక్క అంటే ఏమిటో ఏపీలో జగన్ సర్కార్ ను అడిగితే తెలుస్తుంది.

  • Author : hashtagu Date : 15-03-2022 - 11:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kapu Nestam
Kapu Nestam

పావలాకు రూపాయి లెక్క అంటే ఏమిటో ఏపీలో జగన్ సర్కార్ ను అడిగితే తెలుస్తుంది. ఇచ్చిందేమో పావలా వాటా.. కానీ దానినే రూపాయి ఇచ్చినట్టుగా మ్యాజిక్ చేస్తోంది. కాపుల సంక్షేమానికి కేటాయిస్తున్న నిధుల్లో జరుగుతున్న మాయాజాలాన్ని చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. కాపుల సంక్షేమానికి బడ్జెట్ లో ఏటా రూ.500 కేటాయిస్తోంది. గత మూడు బడ్జెట్ లలోనూ ఇదే తంతు. కానీ దానిని రూ.3000 కోట్లు ఇచ్చినట్టుగా కాకి లెక్కలు చెబుతోందన్న విమర్శలు ఉన్నాయి.

అధికారంలోకి వచ్చాక కాపుల అభివృద్ధికి ఏటా రూ.2000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తామని ఆనాడు జగన్ చెప్పారు. కానీ ఇప్పుడు బడ్జెట్ లలో కాపు సామాజికవర్గానికి కేటాయిస్తున్న నిధులను చూస్తే.. ఆ వర్గమే నివ్వెరపోతోంది. ఎందుకంటే కాపుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకం ఏదైనా ఉందీ అంటే.. అది కాపు నేస్తం ఒక్కటే. దానికి ఏటా 500 కోట్లు మాత్రమే కేటాయిస్తోంది. కానీ ఖర్చు మాత్రం దాదాపు రూ.490 కోట్లు వస్తోంది. కాపు కార్పొరేషన్ పేరుతో ఆ వర్గంలో పేదలకు స్వయం ఉపాధికి నిధులు అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. కానీ ఇక్కడ జరుగుతోంది వేరే. అధికారంలోకి వచ్చాక అన్ని పథకాలను రద్దు చేసి కాపునేస్తం ఒక్కటే ప్రారంభించి అమలు చేస్తోంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న 3.3 లక్షల మంది మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం చేస్తోంది. దీనికోసం ఏటా రూ.490 కోట్లు ఖర్చవుతున్నాయి. మరి ప్రభుత్వం కేటాయిస్తున్నానని చెప్పిన మిగిలిన రూ.1500 కోట్లు ఎక్కడ?

ప్రభుత్వం మాత్రం తాను ఏటా రూ.2000 కోట్లు కేటాయిస్తున్నట్టుగా చెప్పుకోవడం కోసం.. ఇతర వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను.. ఈ వర్గం కోసమే ప్రత్యేకంగా అమలు చేస్తున్నట్టుగా చూపిస్తోంది. అంటే జగనన్న చేదోడు, జగనన్న విద్యాదీవెన, పెన్షన్లు, వసతి దీవెన, అమ్మఒడి, నేతన్న నేస్తం, ఆసరా.. ఇలాంటి పథకాలనూ కాపులకోసమే అమలు చేస్తున్నట్టుగా వారి ఖాతాలో కలిపేసింది. దీంతో ఏటా వారి కోసం కేటాయిస్తామని చెప్పిన రూ.2000 కోట్ల మార్కును కూడా దాటిపోయి.. రూ.3000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు లెక్క తేలింది దీంతో కాపులే ఈ లెక్కలు చూసి విస్తుపోతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Jagan
  • AP government
  • Kapu caste
  • Kapu leader

Related News

Godavari Pushkaralu 2027 to Be Held on Kumbh Mela Scale as Pawan Kalyan

Godavari Pushkaralu: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివిధ అంశాలపై చర్చించారని, ప్రధానంగా నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శ

    Latest News

    • నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

    • IPL: ‘పవర్’ప్లే లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..!!

    • Cake : వామ్మో ఒక్క కేక్ తయారీకి 3,500 గంటల సమయం!

    • ప్రధాని మోదీకి ఉల్లిపాయలు ఇష్టమేనా?

    • KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd