HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Governments Key Announcement On Housing Sites For The Poor

AP Govt : పేదలకు ఇళ్ల స్థలాలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

AP Govt : ఈ పథకానికి అర్హత సాధించాలంటే దరఖాస్తుదారుడు బీపీఎల్ (BPL) కుటుంబానికి చెందినవాడై ఉండాలి

  • By Sudheer Published Date - 05:02 PM, Fri - 17 January 25
  • daily-hunt
Minister Parthasarathi Abou
Minister Parthasarathi Abou

పేదలకు ఏపీ సర్కార్ (AP Govt) తీపి కబురు తెలిపింది. భూమి , ఇల్లు లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలాన్ని కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి పార్థసారథి ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన మార్గదర్శకాలను ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. ఈ పథకానికి అర్హత సాధించాలంటే దరఖాస్తుదారుడు బీపీఎల్ (BPL) కుటుంబానికి చెందినవాడై ఉండాలి. అంతేకాకుండా గతంలో ఇల్లు లేదా స్థలం కోసం ఎలాంటి లోన్ తీసుకోకూడదని స్పష్టంగా పేర్కొన్నారు.

Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల

పథకానికి దరఖాస్తు చేసుకునే వారి వద్ద ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలని, ఇది గుర్తింపు మరియు భౌగోళిక సమాచారం కోసం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. అలాగే మెట్ట ప్రాంతాల్లో 5 ఎకరాలకు మించిన వ్యవసాయ భూమి లేకుండా ఉండాలి. మాగాణి ప్రాంతాల్లో ఇది 2.5 ఎకరాలకు మించకూడదని స్పష్టం చేశారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలోని పేద కుటుంబాలకు గొప్ప సాయం జరుగుతుందని మంత్రి పార్థసారథి అన్నారు. పట్టణాలు, గ్రామాల్లో భూముల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఈ పథకం అమలు కోసం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ప్రారంభమవుతుందని, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అధికారులు తెలిపారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో పేదలకు ఆర్థిక భద్రత కలిగేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap govt
  • housing scheme
  • minister partha sarathi

Related News

Ap Secretariat Employees

AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

AP Secretariat Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ సిబ్బంది ప్రస్తుత జాబ్ ఛార్ట్‌లో ఉన్న

    Latest News

    • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

    • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

    • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd