Drug Addicts : మందు బాబులకు ఏపీ సర్కార్ బంపరాఫర్
Drug Addicts : గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. కల్లుగీత కార్మికులకు బార్ లైసెన్స్‌లలో 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు, లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.
- By Sudheer Published Date - 02:33 PM, Thu - 7 August 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) మద్యం విధానంలో కీలక మార్పులు తీసుకువస్తూ, కొత్త బార్ పాలసీ(New Bar Policy)కి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మద్యం రెవెన్యూను పెంచుకోవడమే కాకుండా, కల్లుగీత కార్మికులకు కూడా ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త విధానం ప్రకారం.. బార్ షాపులకు అనుబంధంగా ‘పర్మిట్ రూమ్‌లు’ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీనివల్ల బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం తగ్గి, శాంతి భద్రతల సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ పాలసీ 2025 సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31 వరకు అమలులో ఉంటుంది.
WhatsApp New Feature : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. దీని ద్వారా మీరు మోసాలు, కేసుల నుంచి బయటపడొచ్చు!
కొత్త బార్ పాలసీలో భాగంగా ప్రభుత్వం పలు ముఖ్య నిర్ణయాలు తీసుకుంది. బార్ లైసెన్స్ ఫీజును రూ.5 లక్షలుగా నిర్ణయించారు. బార్ల నిర్వహణ వేళలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు లైసెన్సులు ఇవ్వడానికి టెండర్లు పిలవనున్నారు. ఈసారి పారదర్శకత కోసం లాటరీ విధానాన్ని అనుసరించనున్నారు. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజులను నిర్ణయించారు. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.30 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల లోపు అయితే రూ.55 లక్షలు, 5 లక్షల పైగా ఉన్న నగరాల్లో రూ.75 లక్షలు ఫీజుగా నిర్ణయించారు.
గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. కల్లుగీత కార్మికులకు బార్ లైసెన్స్‌లలో 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు, లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వారి వృత్తిని మరింత స్థిరంగా మార్చడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త పాలసీ, వ్యాపారస్తులకు, కల్లుగీత కార్మికులకు, ప్రభుత్వానికి కూడా లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, దీనిపై సమాజంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also :Uttarakhand Floods : ఉత్తరకాశిలో వర్ష విలయం.. 50 మందికి పైగా కనిపించకుండా