Good News : ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త తెలిపిన కూటమి సర్కార్
తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది
- Author : Sudheer
Date : 17-06-2024 - 9:39 IST
Published By : Hashtagu Telugu Desk
అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..రాష్ట్ర ప్రజలకు వరుసగా గుడ్ న్యూస్ లు అందజేస్తూ మరింత నమ్మకం పెంచుకుంటుంది. ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై మొదటగా సంతకాలు చేశారు. ఎన్నికల్లో ప్రకటించినట్లే సీఎం హోదాలో మెుదట మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి కూడా చంద్రబాబు తన పనిలో నిమగ్నమయ్యారు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించారు. ఇదే తరుణంలో రేషన్ కార్డు దారులకు శుభవార్త తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాదిగా కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. దీంతో పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడం తో వెంటనే రాష్ట్రస్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు పంపారు. ఈనెల 20వ తేదీ నుంచి రేషన్ షాపులకు బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయాల్సి చేయాలనీ ఆదేశాలు పంపారు.దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న ఎంఎల్‌ఎస్ పాయింట్లో దించిన చెక్కర, కందిపప్పు నాణ్యతతోపాటు అక్కడికి వచ్చిన ప్యాకెట్లను తూకం వేసి పరిశీలించారు. వచ్చేనెల 1 నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు.
Read Also : AP Assembly sessions : జూన్ 24 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు