Ramadan 2025 : ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Ramadan 2025 : ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తూ, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు
- By Sudheer Published Date - 08:57 PM, Wed - 12 February 25

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం (Ramadan Masam) ప్రారంభం కానున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ముస్లిం ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తూ, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు విధుల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
New UPI Rule: యూపీఐ లావాదేవీలు.. ఫిబ్రవరి 15 నుంచి కీలక మార్పు!
ఈ సడలింపు మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని స్పష్టంగా తెలియజేసింది. రంజాన్ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తార్ కోసం ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక సడలింపులు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. గతంలో కూడా ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలను అమలు చేశాయి.
ఉద్యోగుల ఆరాధనకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సడలింపు ద్వారా ముస్లిం ఉద్యోగులు ఉపవాస దీక్షను మరింత నిబద్ధతతో పాటించేందుకు అవకాశం లభిస్తుంది. రంజాన్ మాసంలో ఉపవాసం పాటించే వారి శారీరక స్థితిని దృష్టిలో ఉంచుకొని, పని భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముస్లిం ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. తమ విశ్వాసాలకు ప్రభుత్వం గౌరవం ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.