AP Government : పదో తరగతి ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి ప్రశ్నపత్రాల్లో(Question Paper) స్వల్ప మార్పులు చేసింది. మొదటి, రెండో భాషా ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకొచ్చింది.
- By News Desk Published Date - 09:30 PM, Thu - 27 July 23

ఏపీ ప్రభుత్వం(AP Government) విద్యావ్యవస్థలో పలు మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలలో అనేక అంశాలలో పలు మార్పులు తీసుకురాగా తాజాగా మరో కొత్త మార్పుకి శ్రీకారం చుట్టింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి ప్రశ్నపత్రాల్లో(Question Paper) స్వల్ప మార్పులు చేసింది. మొదటి, రెండో భాషా ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకొచ్చింది. మొదటి భాష తెలుగు(Telugu)తో పాటు రెండో భాషగా ఉన్న హిందీ, ఒడియా, ఉర్దూ, కన్నడ, తమిళ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసింది. ఈ మేరకు మార్పులకు సంబంధించి బ్లూప్రింట్లను వెబ్‌సైట్ లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వెయిటేజీతో పాటు మోడల్ పేపర్లను వెబ్‌సైట్ లో పెట్టినట్లు వెల్లడించింది.
సైన్స్ ప్రశ్నపత్రం నమూనా కూడా మారుస్తామని , అది కూడా త్వరలో వెబ్‌సైట్ లో పెడతామని అధికారులు తెలిపారు. ఆంగ్లం, గణితం, సోషల్ స్టడీస్ పేపర్లలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు.
Also Read : Woman missing : పవన్ కళ్యాణ్ పై వాసిరెడ్డి పద్మ విమర్శలు