AP : చంద్రబాబు అరెస్ట్ ను క్యాష్ చేసుకోవాలని జగన్ ముందస్తుకు వెళ్తున్నాడా..?
ఈ సానుభూతి ఎక్కువ కాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ చూస్తున్నాడట.
- By Sudheer Published Date - 01:23 PM, Fri - 29 September 23

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎన్నికల గాలి వీయడం మొదలైంది..తెలంగాణ లో మరో రెండు , మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నట్లు తెలుస్తున్నాయి. అటు ఏపీలో ఆరు నెలల వరకు టైం ఉంది. కానీ ఇప్పుడు అక్కడ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణా లో ఇప్పటీకే రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ (BRS)..మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. అటు కాంగ్రెస్ (Congress) పార్టీ సైతం ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. దానికి తాగగట్లే వ్యూహ రచనలు చేస్తూ ఉండడం తో ప్రజల్లో కాంగ్రెస్ ఫై చూపు పడుతుంది. అంతే కాకుండా బిఆర్ఎస్ నుండి కూడా పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరుతుండడం తో ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ధీమా అందరిలో కలుగుతుంది. ఇక బిజెపి (BJP) పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఎన్నికల సంగతి ఏమోకానీ ఉన్న నేతలను బయటకు వెళ్లకుండా కాపాడుకోవడమే సరిపోతుంది. ఇలా తెలంగాణ మూడు పార్టీల పరిస్థితి.
అటు ఏపీ విషయానికి వస్తే..చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. అక్రమ కేసులో చంద్రబాబు ను అరెస్ట్ చేసారని పెద్ద ఎత్తున ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కేవలం టీడీపీ శ్రేణులే కాదు ఇతర రాష్ట్రాలలో , దేశాలలో ఉన్న తెలుగు వారు సైతం చంద్రబాబు కు మద్దతు తెలుపుతూ..వైసీపీ ని వ్యతిరేకిస్తున్నారు. రోజు రోజుకు చంద్రబాబు ఫై మద్దతు పెరుగుతుంది. కానీ వైసీపీ (YCP) మాత్రం చంద్రబాబు తప్పు చేసాడని పబ్లిసిటీ చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది. ఇప్పటీకే కరపత్రాలను పంచుతూ నానా హడావిడి చేస్తున్నప్పటికీ , ప్రజలు మాత్రం బాబు ఫై సానుభూతి తెలుపుతున్నారు. కానీ ఈ సానుభూతి ఎక్కువ కాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ చూస్తున్నాడట.
ఆ మద్య వైసీపీకి చెందిన ఓ మంత్రి మాట్లాడుతూ ఏపీ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు కూడా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్తే మేలని జగన్ భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండడం..టీడీపీ ప్రజలు కూడా అయోమయంలో ఉండడం తో ఈ పరిస్థితులను వైసీపీని అనుకుకూలంగా మార్చుకోవాలంటే ఎన్నికలకు వెల్లడమే మంచిదని జగన్ ఆలోచిస్తున్నారట. అందుకే అక్టోబర్ 10 లోపే అసెంబ్లీ రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా జగన్ ముందస్తు కు వెళ్తాడా..? వెళ్తే ఆయనకు లాభమా..? చంద్రబాబు కు లాభమా..? ప్రజలు ఎటు ఓటు వేస్తారు..? అనేది చూడాలి.
Read Also : World Heart Day : హైపర్ టెన్షన్ తో గుండెకు గండం.. సరైన జీవనశైలితో సంపూర్ణ ఆరోగ్యం