Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం..హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు
వినాయక చవితి రాబోతుందని.. ఈ సందర్భంగా నిర్వహించే వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని , మట్టి గణపతుల ద్వారా జల కాలుష్యాన్ని అరికట్టవచ్చన్నారు
- By Sudheer Published Date - 06:49 PM, Mon - 8 July 24

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ కనపరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి నుండి కుడి పకృతి ప్రేమికుడు అనే సంగతి తెలిసిందే. నిత్యం తన వ్యవసాయ క్షేత్రంలో పర్యావరణానికి సంబదించిన పుస్తకాలు చదువుతూ..ఆ మేరకు తన ఆలోచనలు షేర్ చేస్తుండేవారు. ఇక ఇప్పుడు ఆయన తీసుకున్న శాఖల్లో పర్యావరణ కూడా ఉండడంతో తన ఆలోచనలు షేర్ చేస్తూ..పర్యావరణ రక్షణ కు సంబదించిన ఆలోచనలు తెలియజేయాలని కోరడం తో పలు స్వచ్ఛంద సంస్థలు , ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున తమ ఆలోచనలను , ఐడియా లు షేర్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా పవన్ కల్యాణ్ ను మంగళగిరిలోని ఆయన నివాసంలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్ కలిశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అవసరమైన సూచనలు తెలియజేసారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పర్యావరణ హితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వినాయక చవితి రాబోతుందని.. ఈ సందర్భంగా నిర్వహించే వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని , మట్టి గణపతుల ద్వారా జల కాలుష్యాన్ని అరికట్టవచ్చన్నారు.
మట్టి గణపతికి పూజలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే పిఠాపురంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని , దేవాలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్ తో చేసిన కవర్లలో అందిస్తున్నారన్నారు. బటర్ పేపర్ వినియోగాన్ని తగ్గించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారని తెలిపారు. అలాంటి కవర్ల స్థానంలో చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలని సూచించారు. ఇక పవన్ తీసుకున్న ఈ నిర్ణయాలపై ప్రజలు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పర్యావరణహితంగా వేడుకలు… ఉత్సవాలు చేసుకొంటే మేలు
•వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారురాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై… pic.twitter.com/7paZnVdE4z
— JanaSena Party (@JanaSenaParty) July 8, 2024
Read Also : Skill University : ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే ‘స్కిల్ యూనివర్సిటీ’ : సీఎం రేవంత్