Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం లేకుండానే తెలుగు సీఎంల సమావేశం..
ఈ కీలక సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవడంఫై అంత మాట్లాడుకుంటున్నారు
- By Sudheer Published Date - 04:41 PM, Sat - 6 July 24

మరికాసేపట్లో బేగంపేటలోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ (Jyotirao Phule Praja Bhavan)లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు , రేవంత్ రెడ్డి (Chandrababu & Revanth Reddy Meeting) లు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం ఫై రెండు రాష్ట్రాల ప్రజలు , రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ సమావేశంలో ఇరు సీఎంలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..? ఆ నిర్ణయాలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో..? ఏ రాష్ట్రానికి మార్లు జరుగుతుంది..? ఏ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది..? లేదా ఇరు రాష్ట్రాలకు సమానంగా న్యాయం జరుగుతుందా..? వీరు తీసుకునే నిర్ణయాల ఫై బిఆర్ఎస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో..? వంటి అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వీరి సమావేశం అనగానే బిఆర్ఎస్ పలు విమర్శలు చేస్తూ..సోషల్ మీడియా లో రకరకాల పోస్ట్ లు పెడుతూ..తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా నిరుద్యోగుల్లో ఆగ్రహపు జ్వాలలు నింపుతుంది. మరి ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం చెప్పే అంశాల ఫై ఏ విద్యాయంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ప్రస్తుతం ఇరు ముఖ్యమంత్రులు పలు డిమాండ్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపకాలు. 15 సంస్థల మధ్య రుణ పంపకాలు. ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులు. ఉద్యోగుల పరస్పర బదిలీలు. లేబర్ సెస్ పంపకాలు, పెడ్యుల్-10లో 142 సంస్థలు- 38వేల కోట్ల ఆస్తుల పంపకం, చట్టంలో పేర్కొనని రూ. 1759 కోట్ల విలువైన 12 సంస్థలు, విభజన పూర్తికాని సంస్థల బ్యాంకు ఖాతాల్లోని రూ 8వేల కోట్ల వినియోగం,10వ షెడ్యూల్ సంస్థల్లోని రూ.1,435 కోట్ల వినియోగంతోపాటు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..చంద్రబాబు ముందు పలు డిమాండ్స్ ను కోరుతున్నట్లు వినికిడి.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్స్ (Telangana CM Revanth Reddy’s Demands) చూస్తే..
1) తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగం కావాలి.
2) ఏపీలో కలిపిన 7 మండలాలు వెనక్కి ఇవ్వాలి.
3) విద్యుత్ బకాయిలు రూ.24వేల కోట్లు చెల్లించాలి.
4) కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం ఇవ్వాలి.
5) 100కి.మీల కోస్టల్ కారిడర్‌లో తీరప్రాంతం వాటా కావాలి.
6) కృష్ణాజలాల్లో 558 TMCలు కేటాయించాలి.
ఇటు ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu Demands) డిమాండ్స్ చూస్తే..
1) హైదరాబాద్‌లోని 3 భవనాలు ఏపీకి కేటాయించాలి.
2) విద్యుత్ బకాయిలు రూ.7,200 కోట్లు చెల్లించాలి.
3) జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తుల పంపకం ఉండాలి.
4) విభజన చట్టంలో పెట్టని ఆస్తుల్నీ పంచాలి.
5) వెంటనే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి ఇవి తెలంగాణ సీఎం రేవంత్ ముందు ఉంచబోతున్నట్లు తెలుస్తుంది. మరి వీటిలో ఏ ఏ డిమాండ్స్ కు ఓకే చెపుతారు అనేది చూడాలి.
ఈ కీలక సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) హాజరుకాకపోవడంఫై అంత మాట్లాడుకుంటున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం లో అధికారంలోకి వచ్చిందంటే దానికి కర్త , కర్మ , క్రియ పవన్ కళ్యాణ్..అలాంటి ఆయన రెండు రాష్ట్రాల సమస్యల గురించి మాట్లాడుతున్న వేళ రాకపోవడం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు.
ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు అవుతున్నారంటే..
తెలంగాణ తరఫున..
రేవంత్ రెడ్డి, సీఏం
భట్టి విక్రమర్క, డిప్యూటీ సీఎం,
పొన్నం ప్రభాకర్ గౌడ్, మంత్రి
శ్రీధర్ బాబు, మంత్రి
అధికారులు :
శాంతి కుమారి, సీఎస్
మరో ఇద్దరు అధికారులు
ఆంధ్ర ప్రదేశ్ నుండి
చంద్రబాబు నాయుడు, సీఏం
మంత్రులు :
కందుల దుర్గేశ్
సత్య ప్రసాద్
బీసీ జనార్ధన్
ఆఫీసర్లు :
నీరబ్ కుమార్, సీఎస్
కార్తికేయ మిశ్రా, ఐఏఎస్
రవిచంద్ర, ఐఏఎస్ హాజరు అవుతున్నారు.