YSR Death Anniversary : ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ సమాధికి నివాళులర్పించిన వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు…!!
ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా కడప జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద ఏపీ సీఎం జగన్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
- By hashtagu Published Date - 10:21 AM, Fri - 2 September 22

ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా కడప జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద ఏపీ సీఎం జగన్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్ జగన్ ఆయన సతీమణి భారతి, వైఎస్ విజయమ్మ, వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పలువురు వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారు. 2004సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
వైఎస్సార్ భౌతికంగా దూరమైనా ఆయన చిరునవ్వు ఎప్పటికీ నిలిచే ఉంటుందని జగన్ గుర్తు చేశారు. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాశం కావాలని వైఎస్సార్ చెప్పారని జగన్ గుర్తు చేశారు. వైఎస్సార్ స్పూర్తితో తమ సర్కార్ ముందుకు సాగుతుందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ ఆయన తండ్రి వైఎస్సార్ ను గుర్తు చేసుకున్నారు.
నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2022