Independence Day : ఏపీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు…జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్..!!
ఏపీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు.
- Author : hashtagu
Date : 15-08-2022 - 10:25 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు. మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు నుంచి ముఖ్యమంత్రి గౌరవ వందనం అందుకున్నారు.
వేడుకల్లో భాగంగా 12వ కంటిజెంట్స్ నిర్వహించిన పరేడ్ ను ముఖ్యమంత్రి జగన్ తిలకించారు. ఆ వాహనంలో ఆయన వెంట సీఎస్, డీజీపీ ఉన్నారు. అలాగే పది బ్యాండ్స్ ప్రదర్శన నిర్వహించనున్నారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా పలు శాఖల శకటాలను రెడీ చేశారు. సాయంత్రం 5.30గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఎట్ హెం కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సీఎం జగన్ సహా పలువురు నేతలు అధికారులు హాజరుకానున్నారు.