Jagan : జగన్ కు ఏపీ ఒక గెస్ట్ హౌస్ లా మారిందా.?
Jagan : తాడేపల్లి-బెంగళూరు మధ్య విహరిస్తూ, ప్రజలతో నేరుగా మమేకం కాకుండా మైదానానికి దూరంగా ఉండటం, ఆయన ప్రజాపక్ష నాయకుడిగా ఉండే విశ్వాసాన్ని తక్కువ చేస్తోందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి
- By Sudheer Published Date - 09:06 PM, Tue - 8 April 25

వైసీపీ (YCP) పార్టీకి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) ఆంధ్రప్రదేశ్(AP)కు దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం బెంగళూరు(Bangalore)ను కేంద్రంగా చేసుకుని పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్న జగన్, రాష్ట్రానికి అవసరమైన సమయంలో మాత్రమే అడుగు పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారాన్ని కోల్పోయిన అనంతరం, తన పార్టీ నేతల అరెస్టులు, పరామర్శలు, రాజకీయ విమర్శలు చేసే సందర్భాలలో మాత్రమే ఆయన రాష్ట్రంలో కనిపిస్తున్నారు.
Manchu Family Issue: మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మంచు ఫ్యామిలీ.. పోలీసులు ఏం చేశారంటే..?
తాజాగా రాప్తాడు పర్యటన (Raptadu Tour) సందర్భంగా మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడమే కాకుండా, పోలీసు అధికారులపై కూడా దూషణలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్రం వెలుపల ఉండడాన్ని బలంగా విమర్శించిన జగన్, ఇప్పుడు తానే అదే తరహాలో వ్యవహరిస్తుండడం పై విమర్శలు తలెత్తుతున్నాయి. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను “పార్ట్ టైం పొలిటీషియన్”గా అభివర్ణించిన జగన్, తాను “స్పెషల్ గెస్ట్” పాత్ర పోషిస్తున్నట్టు చూపిస్తున్నారని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు.
ప్రస్తుతం జగన్ రాజకీయ విధానం ప్రజలకు అసంతృప్తిని కలిగించడమే కాక, ఆయన్ను పార్టీలోనూ నెగటివ్ ప్రభావానికి గురి చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాడేపల్లి-బెంగళూరు మధ్య విహరిస్తూ, ప్రజలతో నేరుగా మమేకం కాకుండా మైదానానికి దూరంగా ఉండటం, ఆయన ప్రజాపక్ష నాయకుడిగా ఉండే విశ్వాసాన్ని తక్కువ చేస్తోందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఓటమి అనంతరం రాష్ట్ర ప్రజలలో విశ్వాసం తిరిగి పొందాలంటే జగన్ ప్రస్తుత రాజకీయం కాకుండా, మళ్లీ ప్రజల మధ్యకి వచ్చి వారితో మమేకం కావాల్సిన అవసరం ఉందని విమర్శకులు సూచిస్తున్నారు.