HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Assembly Speaker Disqualifies 8 Mlas

Ap : స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం – 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

  • Author : Sudheer Date : 27-02-2024 - 12:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Assembly Speaker Disqual
Ap Assembly Speaker Disqual

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని (AP Speaker Tammineni Sitaram) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేల (Sitaram has Disqualified 8 MLAs )పై అనర్హత వేటు వేశారు. వైసీపీ (YCP), టీడీపీ (TDP) పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయో తెలియంది కాదు..ఎన్నికల గడువు దగ్గరికి వస్తున్న కొద్దీ ఏ నేత ఏ పార్టీ లో చేరుతున్నారో..ఏ పార్టీ నేతలతో రహస్యంగా భేటీ అవుతున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. వరుసపెట్టి అధికార , ప్రతిపక్ష పార్టీలలో వలసల పర్వం కొనసాగుతుంది. ఉదయం ఓ పార్టీ లో , రాత్రి ఓ పార్టీ లో చేరుతూ..కార్యకర్తలను , పార్టీ అధిష్టానాలను అయోమయానికి గురి చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇలాంటి ఈ తరుణంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం అందర్నీ షాక్ లో పడేసింది. వైసీపీ చేసిన పిటిషన్ లో అనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవి పేర్లు ఉండగా, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ (Mekapati Chandrashekhar Reddy, Undavalli Sridevi, Karanam Balaram, Maddala Giri, Vallabhaneni Vamsi, Kotam Reddy Sridhar, Anam Narayan Reddy and Vasupally Ganesh) పేర్లు ఉన్నాయి. ఇలా రెండు పార్టీలలో సమానంగా నేతలు ఉండడం తో ఏ పార్టీ కి సపోర్ట్ చేయకుండా ఇరుపార్టీలకు చెందిన మెుత్తం 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న క్రమంలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గెలిచిన పార్టీని విడిచి మరో రాజకీయ పార్టీకి మారడంతోనే వీరిపై అనర్హత వేటు వేశారు. స్పీకరు తీసుకున్న ఈ నిర్ణయం ఏ పార్టీకి కలిసి వస్తుందనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Read Also : Indiramma Abhayam Scheme : ఏపీలో కాంగ్రెస్ ప్రకటించిన తొలి హామీ ఇదే..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap speaker tammineni sitaram
  • disqualified 8 MLAs
  • tdp
  • ycp

Related News

Btechravi

జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

Pulivendula politics : పులివెందులలో వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది. వైఎస్ జగన్‌కు సన్నిహితులైన దంతులూరి కృష్ణ అనుచరుడు, మరికొన్ని కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈ సభలో జగన్‌ను ‘కన్నడ బిడ్డ’ అంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులివెందుల అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, శ్రీనివాసరెడ్డిలు జగన్‌ను విమర్శించారు. స్థానిక ఎన్న

  • Botsa Satyanarayana Daughte

    YCP : రాజకీయాల్లోకి మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె ..?

Latest News

  • తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

  • భారత్ vs సౌతాఫ్రికా ఈ సిరీస్‌ చివరి టీ20!

  • కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు

  • విటమిన్​ బి12 లోపం లక్షణాలు ఇవే!

  • లోకేష్ కు ‘ఇంటివారితో’ పెద్ద కష్టమే వచ్చిపడింది !!

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd