HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Assembly Adjourned To Ellundi

AP Assembly Sessions 2024 : ఏపీ అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా

ap assembly sessions : ఈరోజు ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కు ఆమోదం లభించింది. రేపు అసెంబ్లీకి సెలవు ఉండనుంది. రేపు ఉ.11 గంటలకు ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఉంటాయి

  • Author : Sudheer Date : 11-11-2024 - 1:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Assembly Adjourned To El
Ap Assembly Adjourned To El

ఏపీ రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ఈరోజు ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కు ఆమోదం లభించింది. రేపు అసెంబ్లీకి సెలవు ఉండనుంది. రేపు ఉ.11 గంటలకు ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఉంటాయి. మ.2 గంటలకు కూటమి శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే కూటమి పార్టీల శాసనసభ సభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అందరూ విధిగా హాజరు కావాలని పార్టీ నుంచి ఆదేశాలను జారీచేశారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే . సమావేశాలు ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు వెంకట పాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వెలగపూడిలో అసెంబ్లీ నిర్మించినప్పటి నుంచి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం చంద్రబాబు కు ఆనవాయితీ. సమావేశాలు ప్రారంభం కాగానే.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జె‌ను ప్రవేశ పెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ (AP Budget 2024) ప్రవేశ పెట్టడం జరిగింది.

ఇందులో రెవెన్యూ వ్యయాన్ని 2లక్షల34 వేలకోట్లుగా మూలధన వ్యయాన్ని 32 వేల 712 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 34 వేల 743 కోట్లు, ద్రవ్య లోటు 68 వేల 743 కోట్లుగా ఉండొచ్చని, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి – జీఎస్​డీపీలో రెవెన్యూ లోటు 4.19 శాతం, ద్రవ్య లోటు 2.12 శాతంగా ఉండొచ్చని వివరించారు. అలాగే ఉన్నత విద్యకు 2వేల 326 కోట్లు, ఆరోగ్యరంగానికి 18 వేల 421 కోట్లు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు 16 వేల 739 కోట్ల రూపాయలు , సంక్షేమానికి, అందులో బీసీల సంక్షేమానికి అత్యధికంగా 39వేల 7 కోట్లు కేటాయించారు. ఎస్సీ సంక్షేమానికి 18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7వేల 557 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 4 వేల 376 కోట్లు ప్రతిపాదించారు. మహిళా శిశుసంక్షేమ శాఖకు 4వేల285 కోట్లు దక్కాయి. ఇక కీలకమైన పాఠశాల విద్యాశాఖకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖకు 29 వేల 909 కోట్లు, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధిక కల్పనకు కీలకమైన నైపుణ్యాభివృద్ధి శాఖకు 12 వందల 15 కోట్లు కేటాయించారు.

Read Also : Beauty Tips: ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచే కివి.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Assembly adjourned
  • AP Assembly Sessions
  • ap assembly sessions highlights
  • chandrabbau
  • Minister Payyavula Keshav

Related News

Ap Assembly Budget 2026

AP Assembly Budget : రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్!

పయ్యావుల కేశవ్ సుమారు రూ.3.32 లక్షల కోట్ల భారీ అంచనాతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కేటాయింపులు గణనీయంగా పెరగడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే మరోవైపు అభివృద్ధికి పెద్దపీట వేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly Sessions : నేటి అసెంబ్లీ షెడ్యూల్

Latest News

  • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

  • ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌- 10లోకి ఇషాన్ కిష‌న్‌!

  • ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంకి 45 ఏళ్లు..స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌

  • గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

  • ఉద్యోగులకు రూ.20 కోట్లతో కాస్ట్‌లీ కార్లు గిఫ్ట్‌..

Trending News

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd