HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Setback For Ysrcp Former Bhimavaram Mla Grandhi Srinivas Resigns

YSRCP: వైకాపాకు మరో షాక్? భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ రాజీనామా!

వైకాపాకు మరో షాక్: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ పార్టీ రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

  • Author : Kode Mohan Sai Date : 12-12-2024 - 12:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Big Shock To Ysrcp
Big Shock To Ysrcp

YSRCP: వైకాపా (YSRCP) పార్టీకి వరుస షాక్‌లు ఆగడం లేదు. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేసిన కొన్ని గంటలకే, మరొ కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైకాపాకు చెందిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ తన రాజీనామాను ప్రకటించారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వం మరియు పార్టీ పదవులకు గుడ్‌బై చెప్తూ, గ్రంధి శ్రీనివాస్‌ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు.

గ్రంధి శ్రీనివాస్: ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ను ఓడించిన నేత

గ్రంధి శ్రీనివాస్, ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అందుకు కారణం 2019 ఎన్నికల్లో ఆయన ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై గెలవడమే. అలాంటి నేత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. బయట ఎక్కడా కనిపించడం లేదు. అటు పార్టీలోనూ యాక్టివ్‌గా లేరనే టాక్ ఉంది. దీంతో గ్రంధి శ్రీనివాస్ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో అయినా రాజీనామా లేఖను జగన్ కు పంపారు. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తే.. భీమవరం నియోజకవర్గంలో పార్టీకి దిక్కెవరు అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది.

గ్రంధి శ్రీనివాస్‌ తీవ్ర అసంతృప్తి:

గ్రంధి శ్రీనివాస్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పుడే కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా శ్రీనివాస్ అసంతృప్తితో రగిలిపోయారని చెబుతున్నారు. అందుకు కారణం మంత్రి పదవేనట. పవన్ కళ్యాణ్‌పై గెలిచిన తనకు మంత్రి పదవి ఇస్తారని గ్రంధి శ్రీనివాస్ ఆశించారు. కానీ.. రాలేదు. రెండో దఫా అయినా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అప్పుడు కూడా రాలేదు. దీంతో ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వెళ్లగక్కినట్టు తెలిసింది.

‘ఇంత డబ్బు, సమయం ఖర్చు చేసి పవన్ కళ్యాణ్‌పై గెలిచాను. నాకే మంత్రి పదవి ఇవ్వలేదు. కనీసం పార్టీలో గౌరవం లేకుండా పోయింది. నా మాట కొందరు అధికారులు వినడం లేదని చెప్పాను. వారిని కూడా మార్చలేదు. భీమవరం వైసీపీలో వేరే ప్రాంతాల వారి పెత్తనం పెరిగిపోయింది. ఎవ్వరి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీలో ఉండటం అవసరమా’ అని గ్రంధి శ్రీనివాస్ 2024 అసెంబ్లీ ఎన్నికల ముందే తన సన్నిహితులతో అన్నట్టు తెలిసింది.

పార్టీలోని కీలక నేతలు గ్రంధికి సర్ధిచెప్పి 2024 ఎన్నికల్లో నిలబెట్టారు. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి గ్రంధి ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇటీవల జగన్ పశ్చిమగోదావరి జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి కూడా గ్రంధి శ్రీనివాస్ రాలేదు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది. అటు క్యాడర్‌కు అందుబాటులో ఉండటం లేదనే టాక్ నడుస్తోంది. ఈ సమయంలో పార్టీకి రాజీనామా చేసి జగన్ కు షాక్ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhimavaram Ex MLA Grandhi Srinivas
  • Big ShocK To YSRCP
  • grandhi srinivas
  • Grandhi Srinivas Resigned
  • ys jagan

Related News

Massive Fire Accident In Amaravati

అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

L&T pipes  అమరావతి నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో జీర్ణించుకోలేని శక్తులు కుట్రలకు తెరలేపాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి పనులు శరవేగంగా సాగుతుండటాన్ని తట్టుకోలేక, కొందరు దుండగులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. గతంలో భూసమీకరణ సమయంలో చెరకు తోటలకు నిప్పు పెట్టి రైతులను భయాందోళనలకు గురిచేసిన తరహాలోనే, ఇప్పుడు నిర్మాణ సామాగ్రిని ధ్వంసం చేస్తూ నీచమైన రాజకీయానికి ఒడిగ

  • Polavaram Project

    జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

  • ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

    వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

Latest News

  • భారత్‎కు బిగ్ రిలీఫ్..హొర్ముజ్‌ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు

  • పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చిన జింబాబ్వే స్టార్ పేసర్

  • వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

  • War Effect : కళ తప్పిన దుబాయ్.. పర్యాటకులు లేక వెలవెల

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd