Chandrababu Neeru Chettu Scheme : ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో వేలకోట్లు చేతులు మారాయంటూ వైసీపీ ఆరోపణ
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఫై మరో ఆరోపణ చేస్తుంది వైసీపీ సర్కార్. ఇప్పటికే చంద్రబాబుపై పలు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్న సంగతి తెలిసిందే.
- Author : Sudheer
Date : 10-10-2023 - 11:36 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఫై మరో ఆరోపణ చేస్తుంది వైసీపీ సర్కార్. ఇప్పటికే చంద్రబాబుపై పలు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. అసలు స్కామే జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ఫై తప్పుడు ఆరోపణలు చేస్తూ నెల రోజులుగా ఆయన్ను జైల్లో ఉంచిందని , కనీసం బెయిల్ కూడా రానివ్వకుండా సీఎం జగన్ అడ్డుపడుతున్నాడని టీడీపీ ఆరోపిస్తుంది. న్యాయం జరగడానికి కాస్త ఆలస్యమైనా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వారంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటె తాజాగా చంద్రబాబు ఫై మరో ఆరోపణ చేస్తుంది వైసీపీ. చంద్రబాబు (Chandrababu) హయాంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన నీరు-చెట్టు కార్యక్రమం (Neeru Chettu Scheme)లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ (YCP) సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రూ.7036.80 కోట్ల విలువైన పనులు జరిగితే రూ.34,399 కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ‘చంద్రబాబు ఏ పథకం పెట్టినా అది అవినీతే. నీరు-చెట్టు పథకంలో పనులు చేయకుండానే వేల కోట్లు దోచుకున్నారు’ అంటూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది.
We’re now on WhatsApp. Click to Join.
‘గజదొంగ చంద్రబాబు (Chandrababu) నీరు-చెట్టు పథకంలో రూ.12,866 కోట్లు ఖర్చు చేయగా, పనుల విలువ మాత్రం రూ.3,216 కోట్లుగా చూపించారని , మిగిలిన డబ్బు దాదాపు రూ.9,469 కోట్లు జన్మభూమి కమిటీల ద్వారా దోచుకున్నారని ఆరోపిస్తుంది. ఇవికాక ఇసుక, మట్టి ద్వారా రాష్ట్ర ఖజానాకు కన్నం వేసి మరో రూ.24,750 కోట్లు మిగేశారు’ అంటూ వైసీపీ పేరిట పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టుల ఫై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నీరు-చెట్టు కార్యక్రమంలో ఎలాంటి అవినీతి జరగలేదని కావాలంటే చంద్రబాబు ఫై మరో మచ్చ వేయాలని జగన్ టీం ఇలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
Read Also : Dasoju: ప్రజా ఆశీర్వాదంతో కేసీఆర్ మూడోసారి గెలుస్తారు: దాసోజు