Dasoju: ప్రజా ఆశీర్వాదంతో కేసీఆర్ మూడోసారి గెలుస్తారు: దాసోజు
- By Balu J Published Date - 11:36 AM, Tue - 10 October 23

Dasoju: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ‘‘దాదాపు 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సమర్థులైన అభ్యర్థులు కూడా దొరకని కాంగ్రెస్ పార్టీ, 62 సీట్లు గెలుస్తుందని తేల్చడం హాస్యాస్పదం. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మత్తి, గ్రూపు రాజకీయాలు, నాయకుల మధ్య విభేదాలలతో, కనీసం అభ్యర్థులను ప్రకటించలేకపోతుంది’’ ఆయన అన్నారు.
‘‘సందేహాస్పద సర్వేలను చేయడం, వాటిని మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఓటర్లను మభ్యపెట్టడం, CVoter ఒపీనియన్ పోల్ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం. కుట్రపూరిత సర్వేలతో కేసీఆర్ ని దెబ్బకొట్టాలని ‘సీవోటర్’ సర్వే, 2018 సంవత్సరంలోను ప్రయత్నించి భంగపడ్డది. మళ్ళీ 2023 సంవత్సరంలో మరోసారి నకిలీ సర్వే తో ప్రజల ముందుకు వచ్చింది. CVoter సర్వేకు తెలంగాణ ప్రజలు డిసెంబర్ 3న బుద్ధిచెప్తారు’’ పిలుపునిచ్చారు.
‘‘తెలంగాణ అభివృద్ధికి బీజాలు నాటిన సీఎం కేసీఆర్ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి గెలుపొంది, తెలంగాణను అగ్రగామిగా నిలుపుతారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు సరిలేరు ఎవ్వరు. ఏ పార్టీ కుడా బీఆర్‌ఎస్‌కు పోటీ కాదు. బూటకపు సర్వేలు, తప్పుడు కథనాలు కెసిఆర్ విజయాన్ని అడ్డుకోలేవు. తెలంగాణ కోసం తన జీవితాన్ని అర్పించిన కెసిఆర్ కి, తెలంగాణా ప్రజలు మళ్ళి పట్టం కట్టడం ఖాయం’’ అని దాసోజు అన్నారు.