AP DGP: డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ
- By HashtagU Desk Published Date - 03:09 PM, Tue - 15 February 22

ఏపీలో రెండు రోజుల నుండి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ సోమవారం బదిలీ చేసిన జగన్ సర్కార్, ఈరోజు డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు వేసింది. పలు కేసుల విషయంలో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, గౌతమ్ సవాంగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది.
అయితే ఇప్పుడు అనూహ్యంగా బదిలీ చేయడం పై ఐపీఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా గౌతం సవాంగ్ గత రెండు సంవత్సరాలుగా పనిచేశారు. మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ సవాంగ్ అనేక విషయాల్లో ఏపీ పోలీసులు అవార్డులు కూడా అందుకున్నారు.డీజీపీగా గౌతం సవాంగ్ జగన్ సర్కార్‌కు అనుకూలంగా ఉన్నారు. అయితే అకస్మాతుగా గౌతం సవాంగ్ పై ఎందుకు బదిలీ వేటు వేశారు, అందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 2023 జులై వరకు గౌతం సవాంగ్‌కు సర్వీస్ ఉంది. కానీ అర్థాంతరంగా సవాంగ్ పై వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గౌతమ్ సవాంగ్‌ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిందని సమాచారం.