HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhrapradesh Cm Jaganmohanreddy Changes His Political Style Because Of Internal Protest In Ycp

CM Jagan: జగన్.. ఒత్తిళ్లకు లొంగుతున్నారా? 

కాలం దేనినైనా మారుస్తుంది అంటారు. జగమొండిని అనిపించుకున్న ఏపీ సీఎం జగన్ ను కూడా అలాగే కాలం మార్చిందా?

  • Author : Hashtag U Date : 14-04-2022 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
cm jagan

కాలం దేనినైనా మారుస్తుంది అంటారు. జగమొండిని అనిపించుకున్న ఏపీ సీఎం జగన్ ను కూడా అలాగే కాలం మార్చిందా? ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే.. అవుననే అంటున్నారు విశ్లేషకులు. అందుకే తన క్యాబినెట్ మొత్తాన్ని మారుస్తానని చెప్పిన జగన్.. 11 మంది పాతవారిని కొనసాగించాల్సి వచ్చింది. ముందు ఒకరిద్దరు పాతవారికే ఛాన్స్ అన్నారు. తరువాత ఐదారుగురు అన్నారు. ఆపై 11 మందికి ఓకే చెప్పాల్సి వచ్చింది. పదవి పోయిన మంత్రులు అలగడంతో వారిని బుజ్జగించడానికి జగనే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. సజ్జల, మోపిదేవి వంటివారిని రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. అందుకే బాలినేని, సుచరిత లాంటివారితో స్వయంగా భేటీ కాక తప్పలేదు. వారి డిమాండ్లకు తలొగ్గారనీ అంటున్నారు. ఒంగోలు పర్యటన సమయంలో బాలినేనికి కీలక పదవిని ఇస్తామని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇక సుచరిత సంగతి కూడా అంతే.

పదవి పోయి అలిగిన ఇతర మాజీ మంత్రులతోపాటు మంత్రి పదవిని ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలతోనూ జగన్ భేటీ కావాల్సి వచ్చింది. మధ్యవర్తుల ద్వారా చేసిన రాజీ ప్రయత్నాలు అస్సలు వర్కవుట్ కాలేదు. అందుకే వేరే దారి లేక జగనే వారిని బుజ్జగించి.. వారికి తగిన హామీలను ఇవ్వాల్సి వచ్చిందంటున్నాయి వైసీపీ వర్గాలు. అంటే జగన్ రాజకీయంగా ఓ మెట్టు దిగాడనే భావిస్తున్నారు విశ్లేషకులు. 2019లో 151 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని రావడం వల్ల తనకు ఎదురులేదనే భావన జగన్ లో కనిపించింది. తొలి మూడేళ్లు దాదాపుగా అదే నడిచింది. కానీ ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో జగన్ కు అసమ్మతి పవర్ ఏమిటో తెలిసొచ్చింది. తన మాటే శాసనం అనుకునే స్థాయి నుంచి.. చెప్పింది వినడం కూడా అలవాటు చేసుకోవడం వరకు వచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీలో ఎక్కడా అసమ్మతి రాగం వినపడకుండా ముందే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగుతున్నారంటున్నారు విశ్లేషకులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP CM Jagan
  • balineni srinivasa reddy
  • political crisis

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd