HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh State Became Hot Temperatures Reached 45 Degrees

AP Hot : ఏపీలో టెంపరేచర్ టెన్షన్.. 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

AP Hot : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మే నెల రాకముందే చాలా జిల్లాల్లో టెంపరేచర్స్ 45 డిగ్రీలకు చేరాయి.

  • Author : Pasha Date : 07-04-2024 - 8:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deadly Heat Wave
Deadly Heat Wave

AP Hot : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మే నెల రాకముందే చాలా జిల్లాల్లో టెంపరేచర్స్ 45 డిగ్రీలకు చేరాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ప్రత్యేకించి పిల్లలు, ముసలివారు చాలా ఇబ్బందిపడుతున్నారు. వాతావరణం హాట్‌గా ఉండటంతో.. మధ్యాహ్నం టైంలో ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు జనం జంకుతున్నారు.  భానుడి నిప్పుల వర్షం, వడగాలుల ధాటి ఇప్పుడే ఇలా ఉంటే.. మే నెలలో పరిస్థితి ఏమిటని అంతటా చర్చించుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

వామ్మో.. దంచికొడుతున్న ఎండలు

శనివారం రోజు ఆంధ్రప్రదేశ్‌లోని(AP Hot) 19 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా  టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇంకొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతల 44 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, లేవిడి, ప్రకాశం జిల్లా తోకపల్లి, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బలపనూరు ప్రాంతాల్లో 44.9 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. కర్నూలు జిల్లా గూడూరులో 44.6, విజయనగరం జిల్లా రాజాంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పలు జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. అనంతపురం, కర్నూలు, నందిగామ, కావలి, తుని, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల మేర పెరగడం గమనార్హం.రాష్ట్రంలోని 127 ప్రాంతాల్లో తీవ్ర స్థాయి వడగాలులు, 237 మండలాల్లో సాధారణ స్థాయి వడగాలులు వీచాయి.

Also Read :Hirakud Express Accident : విశాఖ – అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. ఏమైందంటే ?

నేటికి, రేపటికి అలర్ట్స్  ఇవీ.. 

ఇవాళ (ఆదివారం) ఏపీలోని 64 మండలాల్లో తీవ్ర స్థాయి , 222 మండలాల్లో సాధారణ స్థాయి వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదివారం విజయనగరం జిల్లాలోని 24 మండలాల్లో, శ్రీకాకుళం జిల్లాలోని 15 మండలాల్లో, పార్వతీపురం మన్యం జిల్లాలోని 11 మండలాల్లో, అనకాపల్లి జిల్లాలోని 7 మండలాల్లో, కాకినాడ జిల్లాలోని 4 మండలాల్లో, తూర్పుగోదావరి, విశాఖల్లోని ఒక్కో మండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ వడగాలుల ప్రభావం ఉంటుందని ఐఎండీ పేర్కొంది.

Also Read :Summer Skin Care Tips : సమ్మర్ స్కిన్ కేర్… హెల్తీ అండ్ బ్యూటీ కోసం కొన్ని చిట్కాలు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 45 Degrees Temperatures
  • andhra pradesh
  • AP Hot

Related News

Scorching heat ahead; intense sultriness today as well.

Weather update: దంచికొట్టనున్న ఎండలు.. నేడు కూడా తీవ్ర ఉక్కపోత

సాధారణంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూలై నెలలో విస్తారంగా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాలి. కానీ, ఈ ఏడాది రుతుపవనాల జాడ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు హడలెత్తిస్తున్నాయి. జూలై మాసంలో కూడా ప్రజలు భానుడి భగభగలకు విలవిలలాడుతున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత నగరమైన బాపట్లలో అత్యధికంగా 42.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. క

  • Supreme Court rejects Telangana's plea regarding the Banakacherla petition.

    Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • INS Mahendragiri joins the Indian Navy.

    INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్

  • StepX Neo Smartphone: ప్రపంచంలోనే తొలి ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన స్టెప్‌ఫన్!

  • Strait of Hormuz: హార్ముజ్ ట్యాంకర్ దాడిలో భారతీయ నావికుడు మరణించినందుకు ఇరాన్ దౌత్యవేత్తను MEA సమన్లు ​​చేసింది

  • Lalu Prasad Yadav: డియోఘర్ పశుగ్రాస కుంభకోణం కేసులో.. సుప్రీంకోర్టు లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊరట

  • Protinex India: ప్రోటిన్‌ఎక్స్ ఇండియా సరికొత్త ప్రచారం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd