YS Jagan Davos : ఏపీకి 1.25లక్షల కోట్ల `దావోస్` పెట్టుబడులు
దావోస్ పర్యటన ముగించుకుని సీఎం జగన్ తాడేపల్లికి చేరుకున్నారు. ఆయన దావోస్ పర్యటన సందర్భంగా 1.25లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు జరిగాయని అధికారికంగా వెల్లడించారు.
- Author : CS Rao
Date : 31-05-2022 - 3:41 IST
Published By : Hashtagu Telugu Desk
దావోస్ పర్యటన ముగించుకుని సీఎం జగన్ తాడేపల్లికి చేరుకున్నారు. ఆయన దావోస్ పర్యటన సందర్భంగా 1.25లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు జరిగాయని అధికారికంగా వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 26 వరకు దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు హాజరైన ఏపీ ప్రతినిధి బృందానికి సీఎం జగన్ నేతృత్వం వహించారు. పలు దిగ్గజ కంపెనీలతో భేటీలు జరిపిన జగన్ రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించారు. ఈ నెల 26న దావోస్ సదస్సు ముగియగా, మంగళవారం విజయవాడ చేరుకున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని ఉదయం విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సందర్భంగా సీఎం జగన్‌కు స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ స్వాగతం పలికారు. అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మంత్రి జోగి రమేశ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు కూడా జగన్‌కు స్వాగతం పలికారు.
విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సీఎం శ్రీ వైయస్.జగన్ కు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారు లు. pic.twitter.com/fL2yYdzIfz
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 31, 2022