HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Government Offers A 50 Subsidy On Petrol And Diesel For Disabled People

Petrol Price: కేవలం రూ. 55 కె పెట్రోల్,డీజిల్.. వారికి మాత్రమే ఈ ఆఫర్!

ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక చక్కటి శుభవార్తను తెలిపింది. పెట్రోల్, డీజిల్ కేవలం రూ. 55 లకే అందిస్తోంది. కానీ ఇది కేవలం కొంతమంది మాత్రమేనట.

  • Author : Anshu Date : 13-01-2025 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fuel Price Hike
Fuel Price Hike

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ లీటరు ధర దాదాపుగా వంద రూపాయలకు పైగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వాహనా వినియోగదారులకు ఒక చక్కటి శుభవార్తను తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ అందించేందుకు సిద్ధమైంది. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ కేవలం రూ.55 లకే అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రటకనను చూసి వాహనదారులు ఎగిరి గంతేస్తున్నారు. కానీ ఈ సబ్సిడీ అందరి అనుకుంటే పొరపాటే పడ్డట్టే. ఎందుకంటె ఈ అవకాశం కొద్దీ మందికి మాత్రమే. ఈ ఆఫర్ కేవలం దివ్యాంగులకు మాత్రమే. వీళ్లకు తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ వస్తుంది. మరి ఇంత తక్కువ ధరకు పెట్రోల్‌, డీజిల్‌ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆయా జిల్లాలో దివ్యాంగులు రాయితీపై పెట్రోల్, డీజిల్ పొందొచ్చు. స్వయం ఉపాధి పొందుతూ ఉన్నా లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటన్నా ఈ ప్రయోజనం పొందవచ్చట. అయితే ఇందుకు సంబంధించి సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాయితీ పై దివ్యాంగులు పెట్రోల్, డీజిల్ పొందాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందట. మూడు చక్రాల మోటారైజ్డ్ వాహనం కలిగిన దివ్యాంగులు ఈ ప్రయోజనం పొందవచ్చట. పెట్రోల్, డీజిల్‌ ధరలపై 50 శాతం రాయితీ లభిస్తుందట. ఈ స‌బ్సిడీ ప‌థ‌కం అమ‌లు కోసం రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాల్లో రూ.26 ల‌క్షల‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుందట.

అయితే ఈ రాయితీ పై కూడా పరిమితి ఉంటుందట. 2 హెచ్‌పీ వాహనం అయితే నెలకు 15 లీటర్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన వాహనం అయితే నెలకు 25 లీటర్ల వరకు రాయితీపై పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. మరి ఈ రాయితీ బెనిఫిట్‌ పొందాలంటే వారు వేసుకున్న పెట్రోల్‌,డీజిల్‌కు సంబంధించిన బిల్లులు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుందట. ఆ తర్వాతనే సబ్సిడీ డబ్బులు సదురు దివ్యాంగుల బ్యాంకు అకౌంట్లో జమ చేస్తుంది ప్రభుత్వం. వీరు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల వారు జిల్లాల్లోని విక‌లాంగుల సంక్షేమ కార్యాల‌యాన్ని సంద‌ర్శించి, అద‌న‌పు సమాచారాన్ని తెలుసుకుని ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇందుకోసం ఎలాంటి పత్రాలు కావాలి అన్న విషయాన్ని వస్తే.. విక‌లాంగు సర్టిఫికేట్‌, వెహిక‌ల్ రిజిస్ట్రేష‌న్ ప‌త్రాలు, బ్యాంక్ అకౌంట్ బుక్ మొద‌టి పేజీ, ద‌ర‌ఖాస్తు ఫారం, తెల్ల రేష‌న్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌, పెట్రోల్ కొనుగోలు చేసే బిల్లులు, ఆధార్ కార్డు, ప్రైవేటు సంస్థలో ప‌ని చేస్తున్న ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, ఒక పాస్ పోర్టు సైజ్ ఫోటో.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP government
  • diesel price
  • petrol price

Related News

Good news from the government for those waiting for pensions.

Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతు మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే కొత్తగా 2.20 లక్షల మందికి వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అర్హులైన మహిళలకు రాబోయే ఒకటి రెండు నెలల్లో ప్రతి నెలా రూ. 4 వేల చొప్పున పింఛను అందించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఏప

  • Good news for farmers in AP: Date fixed for 'Annadatha Sukhibhava' funds release.

    Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd