HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Cabinet Meeting Has Concluded Here Are The Key Decisions Taken

AP Cabinate Meeting Ends: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటి.. కీలక అంశాలు ఇవే!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 03-12-2024 - 5:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Cabinate Meeting Ends
Ap Cabinate Meeting Ends

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజనకు సంబంధించి గిరిజన గృహ పథకాన్ని అమలు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం ఆవాస్ యోజన 1.0 కింద గృహాల నిర్మాణానికి కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఐదేళ్లలో నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేసే ప్రతిపాదనపై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంది. ఇరిగేషన్ శాఖలో జీవో 62 అమలు గురించి కూడా క్యాబినెట్ లో చర్చలు జరిగాయి. ఏపీ ఆయుర్వేద, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ చట్టం సవరణకు మంత్రి మండలి ఆమోదం ఇచ్చింది. ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ 2024-29ని కేబినెట్ ఆమోదించి, 2024-29 స్పోర్ట్స్ పాలసీలో కూడా కొన్ని మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

క్యాబినెట్ నిర్ణయాలివే..

  • ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్‌ రిజిస్ట్రేషన్‌ చట్టంలో సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  • పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబరు 15)ని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  • ఐటీ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ పాలసీ 4.0కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  • ఏపీ టెక్స్‌టైల్స్‌ గార్మెంట్‌ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  • ఏపీ మారిటైమ్‌ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  • పులివెందుల, ఉద్దానం, డోన్‌ తాగునీటి ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

జేజేఎం వినియోగంలో జాప్యంపై సీఎం అసంతృప్తి..

క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) అమలులో జాప్యంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మిషన్‌, డీపీఆర్‌ స్థాయిని దాటి ముందుకు వెళ్లట్లేదని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కూడా జేజేఎం ప్రాజెక్టు సద్వినియోగం కుదరడం లేదని, దిల్లీలోనూ ఈ విషయం గురించి ప్రచారం జరుగుతోందని తెలిపారు.

బ్యూరోక్రసీ కారణంగా పథకం సక్రమంగా అమలుకావడం లేదని సీఎం అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రతి ఒక్కరికీ చేరువయ్యే అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని, ఇది మిషన్ మోడ్‌లో అమలైతే అద్భుతమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. పథకాల సక్రమ వినియోగంపై పూర్తిగా దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయిన సందర్భంగా, ఇప్పటివరకు జరిగిన పనులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎవరెవరు ఏం చేసినా అన్న వివరాలతో సహా నివేదిక అందించాలని అన్నారు.

మద్యం, ఇసుక, రేషన్‌ మాఫియాలను అరికట్టామని, ఇప్పుడు బియ్యం మరియు భూ దురాక్రమణ మాఫియాలపై సవాలు ఎదుర్కొంటున్నామని, వీటిని కూడా అరికట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే, కాకినాడ పోర్టులో 41 శాతం వాటాను అరబిందో కంపెనీ స్వాధీనం చేసుకున్నారని, వైకాపా హయాంలో ఆస్తులను లాక్కోవడం ట్రెండ్‌గా మారిందని ఆయన అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP cabinate Meeting
  • CM Chandrababu
  • Jal Jeevan Mission
  • nara lokesh
  • Pawan Kalyan
  • PMAY scheme

Related News

Nara Lokesh

AP ECET 2026 results: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల : నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్-2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఈ ఫలితాలను ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ పరీక్షలో మొత్తం 91.72 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 32,434 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 29,7

    Latest News

    • Bandi Sanjay: బండికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్!

    • Dileep Raj: కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి

    • TDP: రాజ్యసభకు టీడీపీ నుంచి భారీగా ఆశావహుల

    • Tamil Nadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ బలపరీక్ష

    • Nara Lokesh: రజనీకాంత్ స్పీచ్‌పై మంత్రి నారా లోకేశ్ ఫిదా

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd