Sattenapalle : బారికేడ్లను నెట్టివేస్తూ పోలీసులతో గొడవకు దిగిన అంబటి
Sattenapalle : ఇటీవల వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా కూడా అంబటి రాంబాబు పోలీసులపై ఇలాగే దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. పోలీసు వ్యవస్థను వ్యతిరేకించే ఈ తరహా ప్రవర్తనపై సామాజిక వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- By Sudheer Published Date - 04:30 PM, Wed - 18 June 25

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan ) పర్యటన సందర్భంగా పల్నాడు(Palnadu)లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. జగన్ రాకను నిరోధించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తోసివేస్తూ వివాదస్పదంగా ప్రవర్తించారు. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) మరియు ఆయన సోదరుడు అంబటి మురళి నేరుగా రోడ్డుపై ఉన్న బారికేడ్లను లాగిపడేశారు. వారిని అడ్డుకున్న పోలీసులతో అంబటి ఘర్షణకు దిగారు. ఆయన వారిని హెచ్చరిస్తూ, బలవంతంగా కార్యకర్తలను ముందుకు పంపే ప్రయత్నం చేశారు.
Maharashtra : అంత్యక్రియలు మొదలుపెట్టగానే లేచి కూర్చున్న శవం
ఈ ఘటనతో సత్తెనపల్లి పట్టణంతో పాటు పల్నాడు, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. సీఐని నెట్టివేయడం, ఆర్టీసీ బస్సుపై దాడులు చేయడం, పోలీసు నియంత్రణలను అతిక్రమించడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయి. అంబటి భారీ ర్యాలీతో రాగా, నిబంధనల ప్రకారం ఆ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కానీ అంబటి, మళ్లీ రెచ్చిపోయి బారికేడ్లను దూరం చేయిస్తూ పోలీసులతో తిట్ల దాడికి దిగారు. అధికారులను తీవ్రంగా హెచ్చరించడంతో పోలీసు యంత్రాంగం కొంతసేపు తీవ్ర ఒత్తిడికి గురైంది.
ఇటీవల వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా కూడా అంబటి రాంబాబు పోలీసులపై ఇలాగే దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. పోలీసు వ్యవస్థను వ్యతిరేకించే ఈ తరహా ప్రవర్తనపై సామాజిక వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన బాధ్యతను విస్మరించి, పోలీసులను బెదిరించడం, బహిరంగంగా ప్రభుత్వ వ్యవస్థను తక్కువచేసేలా మాట్లాడటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.