CBI వద్దకు అంబటి..పవన్ ఆదాయం ఫై ఆరా తీయాలని పిర్యాదు..?
కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలనీ డిసైడ్
- By Sudheer Published Date - 03:28 PM, Wed - 2 August 23

మినిస్టర్ అంబటి రాంబాబు..పవన్ కళ్యాణ్ ఆదాయం ఫై కన్నేశాడా…? పవన్ ఆదాయాన్ని దెబ్బతీసేందుకు ప్లాన్ చేశాడా..? అందుకే ఢిల్లీ CBI ఆఫీస్ కు వెళ్లబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. గత కొద్దీ నెలలుగా ఏపీ లో వైసీపీ vs జనసేన గా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర మొదలుపెట్టిన దగ్గరి నుండి ఈ వార్ మరింత పెరిగింది. ప్రభుత్వం ఫై పవన్ వరుస ప్రశ్నలు వేయడం..వాటికీ సమాదానాలు చెప్పాలని డిమాండ్ చేయడం తో..వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా..తాజాగా బ్రో (BRO) సినిమాలో ఓ సీన్‌లో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)ను అనుకరిస్తూ పృథ్వీ డాన్స్ చేయడం, ఆయనపై పవన్ కల్యాణ్ సెటైర్లు వేయడం ఇప్పుడు మరింత కాకరేపుతుంది. ఇప్పటికే దీనిపై మంత్రి స్పందించడం..పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై , బ్రో మూవీ ఫై కీలక వ్యాఖ్యలు చేయడం చేసారు. దీనికి జనసేన నుండి కూడా కౌంటర్లు వస్తున్నాయి. ఇక ఇప్పుడు రాంబాబు మరో స్టెప్ ముందుకు వేయబోతున్నట్లు తెలుస్తుంది. బ్రో సినిమా వ్యవహారం, దీని బడ్జెట్, పవన్ కల్యాణ్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్ (pawan kalyan remuneration), విడుదల తరువాత వచ్చిన కలెక్షన్లు వంటి అంశాలన్నింటిపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలకు (CBI) ఫిర్యాదు చేయాలనీ డిసైడ్ అయ్యినట్లు సమాచారం. అందుకు ఈరోజు కానీ రేపు కానీ మంత్రి ఢిల్లీ వెళ్లబోతున్నారని వినికిడి. మరి ఢిల్లీకి వెళ్లి మంత్రి పిర్యాదు చేస్తే..పవన్ నష్టమా..లేదా అనేది చూడాలి.
Read Also : Ambati Rambabu ఫై జనసేన సినిమా.. ‘SSS – సందులో సంబరాల శ్యాంబాబు’ టైటిల్