Amaravati : అమరావతి పై శ్వేతపత్రం విడుదల చేసేందుకు బాబు సిద్ధం
పోలవరం పై శ్వేతపత్రం విడుదల చేసి గత ప్రభుత్వ లోపాలు , తప్పులు , ఖర్చులను బయటపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు..ఇప్పుడు అమరావతి పై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్దమయ్యాడు
- Author : Sudheer
Date : 01-07-2024 - 9:18 IST
Published By : Hashtagu Telugu Desk
ఇప్పటికే పోలవరం పై శ్వేతపత్రం (Polavaram White Paper) విడుదల చేసి గత ప్రభుత్వ లోపాలు , తప్పులు , ఖర్చులను బయటపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu)..ఇప్పుడు అమరావతి పై శ్వేతపత్రం (Amaravati White Paper) విడుదల చేసేందుకు సిద్దమయ్యాడు. వారం రోజుల క్రితం అమరావతిని సందర్శించిన బాబు..అక్కడి పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జగన్ విధ్వంస పాలనలో నిర్వీర్యం అయిన అమరావతిని చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఏపీ అని పిలుస్తారని… దీనిలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరమని చంద్రబాబు పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ రెండు ప్రాజెక్టులకూ అంత ప్రాధాన్యం ఉందన్నారు. జగన్ మూర్ఖత్వం వల్ల ఈ రెండు ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయని ధ్వజమెత్తారు. పోలవరం, అమరావతి.. సంపద సృష్టి కేంద్రాలని, వాటివల్ల మొత్తం సమాజానికే మేలు జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా ఉండాల్సిన ఐదేళ్లపాటు అమరావతిలో జగన్ చేసిన విధ్వంసంపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. అమరావతిలో ఎంత నష్టం జరిగింది? నిర్మాణాలు ఎంతవరకు పనికొస్తాయి? అనే దానిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించినట్లే శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. బుధవారం శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు.
Read Also : Parliament Session: పార్లమెంటులో రాహుల్ ప్రశ్నలపై రేపు ప్రధాని మోడీ సమాధానాలు