Thalliki Vandanam : తల్లికి వందనంపై ఆరోపణలు.. లోకేశ్ క్లారిటీ
Thalliki Vandanam : ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలున్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం/వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేశాకే వారికి నిధులు విడుదలవుతాయి. మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం.. చెయ్య నివ్వం
- Author : Sudheer
Date : 15-06-2025 - 5:38 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam)పథకంపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్కరి ఆధార్ నెంబర్‌తో వందల మందికి నిధులు జమ చేసినట్లు కొన్ని మీడియా కథనాల్లో పేర్కొనడం కలకలం రేపింది. ఈ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. పథకాన్ని అపవదించడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
WTC Prize Money: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఏయే జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ అంటే?
తన అధికారిక ట్విటర్ ఖాతాలో స్పందించిన లోకేశ్.. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలున్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం/వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేశాకే వారికి నిధులు విడుదలవుతాయి. మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం.. చెయ్య నివ్వం’ అంటూ ట్వీట్ చేశారు. ముప్పై ఏళ్లకు పైబడిన తల్లులకు వంద రోజులు హాజరు ఉండే విద్యార్థుల ఆధారంగా ఈ పథకం అమలవుతోందని వివరించారు.
వాస్తవానికి ఈ పథకం ద్వారా తల్లుల కష్టాలను గుర్తించి వారిని గౌరవించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొన్ని తప్పుడు ఆధారాలతో చేస్తున్న ఆరోపణలకు ప్రత్యుత్తరంగా మంత్రి లోకేశ్ ప్రకటన మరింత స్థిరతనిచ్చిందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
#PsychoFekuJagan#TallikiVandanam
తల్లికి వందనం సూపర్ సక్సెస్! తల్లుల కళ్లలో ఆనందం చూసి
జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా… pic.twitter.com/GhgmEkpKJJ— Lokesh Nara (@naralokesh) June 15, 2025