Nara Lokesh: యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తా: మంత్రి నారా లోకేశ్
- Author : Balu J
Date : 14-06-2024 - 9:10 IST
Published By : Hashtagu Telugu Desk
Nara Lokesh: హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన Nara Chandrababu Naidu కు ధన్యవాదాలు తెలిపారు ఏపీ మంత్రి నారా లోకేశ్. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చానని, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని నారా లోకేశ్ అన్నారు.
గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తానని, యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నానని, రాష్ట్రానికి ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని నారా లోకేశ్ అన్నారు.