Chittoor: దీనావస్థలో గజరాజులు.. ఆపన్నహస్తం అందించేదెవరు!
జయంత్ (65), వినాయక్ (52) (శిక్షణ పొందిన ఏనుగులు) చిత్తూరు జిల్లాలో రెండు దశాబ్దాలకు పైగా అటవీ శాఖలో పనిచేశాయి.
- By Balu J Published Date - 06:35 PM, Sat - 19 February 22

జయంత్ (65), వినాయక్ (52) (శిక్షణ పొందిన ఏనుగులు) చిత్తూరు జిల్లాలో రెండు దశాబ్దాలకు పైగా అటవీ శాఖలో పనిచేశాయి. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకుప్పం వద్ద కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యంలోని నానియాల అటవీ శిబిరంలో ఉన్న ఈ రెండు మగ ఏనుగులు అవసాన దశలోకి వచ్చాయి. ఈ ఏనుగులు అటవీ అధికారుల ప్రేమ, అప్యాయతను చూరగొనడంతో పాటు ఎన్నో కార్యకలాపాలను నిర్వహించడంలో సమర్థవంతంగా నిర్వహించాయి.
జయంత్ అనే ఏనుగు తమిళనాడు, కర్ణాటకల మధ్య ఉన్న ట్రై-స్టేట్ జంక్షన్ ఏనుగు కారిడార్‌లో అడవిగా జన్మించింది. రెండు దశాబ్దాల జంక్షన్ నుంచి బయటకు రాగా.. కొన్నాళ్లకు విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు షిఫ్ట్ అయ్యింది. ఇక వినాయక్ అనే ఏనుగు విశాఖపట్నం-చిత్తూరు జీవనం కొనసాగించింది. చాలా మంది మహోత్‌లు, వారి సహాయకులతో అప్యాయంగా మెలిగింది.
కౌండిన్య అభయారణ్యం అడవి మందలను, తమిళనాడు, కర్ణాటక నుండి వలస వచ్చిన అటవీ జంతువులను నియంత్రించడానికి, అసంఖ్యాక కార్యకలాపాలకు అటవీ అధికారులు ఈ రెండు ఏనుగుల ద్వారా చెక్ పెట్టగలిగారు. శేషాచలం కొండల్లోని తలకోన అడవుల్లోని అడవి మందలను తరిమికొట్టడంతోపాటు, పంటలపై దాడి చేసే జంతువులను ఆరికట్టగలిగాయి. నానియాల క్యాంపులో ఉన్న ఈ రెండు ఏనుగులకు ప్రతి సంవత్సరం ₹10 లక్షలు ఖర్చయింది. అడవుల్లో షికారు చేయించడం, వాటికి అవసరమైన బలమైన ఆహారం అందించేందుకు ఇంత మొత్తంలో ఖర్చవుతుంది. ప్రస్తుతం ఈ ఏనుగులు అవసాన దశలోకి ప్రవేశించడంతో, వాటి శ్రద్ధపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. అందుకే దాతల సహయసహకారాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.