Jagan Atchutapuram : అచ్యుతాపురం బాధితులకు అన్యాయం చేస్తే ధర్నా చేస్తా – జగన్ హెచ్చరిక
అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని సీఎం జగన్ పేర్కొన్నారు
- By Sudheer Published Date - 03:14 PM, Fri - 23 August 24

బుధువారం అనకాపల్లిలోని అచ్యుతాపురం (Atchutapuram ) ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన (Reactor Explosion) ఘటన తెలిసిందే. ఈ ఘటన లో దాదాపు 16 మందికి పైగా చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన ఫై ప్రధాని మోడీ దిగ్భ్రాంతం వ్యక్తం చేయగా..మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.25 లక్షల చొప్పున అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి.. అనకాపల్లిలోని (Anakapalli) ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఆస్పత్రిలో వారికి అందుతున్న వైద్య సేవలపై జగన్ ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కాగా అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని సీఎం జగన్ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే బాధితుల పక్షాన వైసీపీ పోరాడుతుందని చెప్పారు. వారి కోసం తానే స్వయంగా నేనే ధర్నాకు వస్తానని జగన్ హెచ్చరించారు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారని చెప్పుకొచ్చారు. ఎంత మంది చనిపోయారో తెలియదన్నారు. ఘటనా స్థలానికి ఆంబులెన్సులు కూడా రాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారని జగన్ వివరించారు. తమ హయాంలో ఇలాంటి ఘటనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. కోవిడ్ సమయంలో ఎల్జీ పాలిమర్స్ లో ఘటన జరిగితే 24 గంటల్లో పరిహారం ఇప్పించామని జగన్ చెప్పుకొచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం తమ ప్రభుత్వంలా స్పందించలేదన్నారు. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు బాధగా అనిపిస్తోందన్నారు. ఈ ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసారు. పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలన్నారు. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలని సూచించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తే ఈ ఘటన గురించి ఎక్కువ స్పందించకూడదు అనే తాపత్రయం కనపడింది
17 మంది చనిపోతే సాయంత్రం 4 గంటలకు హోం మంత్రి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సహాయచర్యలను పర్యవేక్షించడానికి అనకాపల్లి వెళ్తున్న అనేమాట… pic.twitter.com/eDoLJ7cNev
— YSR Congress Party (@YSRCParty) August 23, 2024
Read Also : Rain : హైదరాబాద్ లో విచిత్రం..రెండు ఇళ్ల మద్యే వర్షం