Andhra Pradesh : ఏపీలో “ఆడుదాం ఆంధ్రా” క్రీడోత్సవాలు
అక్టోబర్ 2న ఆడదాం ఆంధ్ర క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన
- By Prasad Published Date - 09:21 AM, Sun - 18 June 23
అక్టోబర్ 2న ఆడదాం ఆంధ్ర క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి క్రీడాశాఖ అధికారులను ఆదేశించారు. క్రీడా విధానం-2023-24పై శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యకార్యదర్శి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రా పండుగను గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో, మండల, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పండుగను నిర్వహించనున్నారు.
ఇందుకోసం అవసరమైన క్రీడా మైదానాలను గుర్తించాలని అధికారులకు సూచించారు.ఆడుదాం ఆంధ్రలో భాగంగా క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. 2023-24 క్రీడా విధానంపై ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలన్నారు. గ్రామీణ యువత ఎక్కువగా భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలి. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, సీఎంఓ కార్యదర్శి ఆర్.ముత్యాలరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ కె.హర్షవర్ధన్, క్రికెటర్ అంబటి రాయుడు పాల్గొన్నారు.